200 మెయిల్స్ ఆరోపణలకు బుగ్గన ఘాటు కౌంటర్-చంద్రబాబు కామెంట్స్ పై ఫైర్..!
ఏపీలో విపక్ష వైసీపీ ప్రభుత్వం ఏపీ మైనింగ్ డెలప్మెంట్ కార్పోరేషన్ తరఫున జారీ చేసిన బాండ్లను కొనొద్దంటూ వివిధ ఆర్ధిక సంస్థలకు మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితులు 200 మెయిల్స్ పెట్టారంటూ తాజాగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. వీటిపై ఇవాళ మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్దంగానే ఏపీఎండీసీ బాండ్ల జారీ జరిగిందన్నారు. వీటిని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా అని నిలదీశారు.
ఏపీఎండీసీ బాండ్ల జారీలో రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కు కల్పించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన కూటమి ప్రభుత్వం దీనిపై ప్రశ్నించినందుకు రాజద్రోహం కేసు పెడతామనడం దివాలాకోరుతనానికి నిదర్శనమని బుగ్గన విమర్శించారు. ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్ధిక సంస్థలకు మెయిల్స్ చేశామంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాజ్యాంగం నిబంధనలనే ఉల్లంఘిస్తూ చేసిన తప్పులను ఎలా సమర్థించుకుంటున్నారని పయ్యావులను ప్రశ్నించారు.

ఈ బాండ్లపై జోక్యం చేసుకోవాలని న్యాయ స్థానాలను కోరితే రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ, కోర్టుకు తప్పుడు ఫిర్యాదులు చేయించిన జగన్, బుగ్గనలను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఆర్ధిక మంత్రి కేశవ్ అర్థంలేని వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.
ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడి పెట్టొద్దంటూ తప్పుడు మెయిల్స్ చేస్తున్నారని, వైసీపీ కుట్రపై విచారణ చేస్తామని సీఎం పేర్కొన్నట్లుగా వచ్చిన కథనాలను ఖండించారు. చంద్రబాబు వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమన్నారు. రూ.9 వేల కోట్లకు బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు నేరుగా డ్రా చేసుకునే హక్కు కల్పించిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు.
గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేదా తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పగలరా? దీనికి బదులివ్వకుండా, ఎందుకు మీరు ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. ఏపీఏండీసీ ద్వారానే కాకుండా కొత్తగా జలజీవన్ వాటర్ సఫ్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా బాండ్లు జారీ చేసి అప్పు చేయాలని మీరు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం కాదా అని అడిగారు. 2025 మే 9న రూ.3489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా అప్పు చేశారని, జూన్ 25న రూ.5526 కోట్లతో కలుపుకుంటే దాదాపు రూ.9వేల కోట్లు బాండ్లు ద్వారా అప్పు చేశారన్నారు. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థ వద్దే ఉన్నాయని, వాటిని ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారాన్ని పెంచేందుకే వాడుతున్నారని, ప్రభుత్వం ఈ డబ్బులు వాడడం లేదు అని చెప్పగలరా అని ప్రశ్నించారు.

ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి సుమారు 400 లీజులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి లీజుదార్లు డబ్బులు చెల్లించారని చెబుతున్నారని, అంటే ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్థిని కొనబోతుందా అని బుగ్గన ప్రశ్నించారు. అంటే భర్త ఆస్తిని భార్య, భార్య ఆస్ధిని భర్త కొనుగోలు చేస్తున్నారా అని నిలదీశారు. గతంలో అధికారంలో ఉండగా రైతుల నుంచి అమరావతి కోసం భూములు తీసుకుని రాజధాని కట్టలేక అప్పులకు వెళ్లి తాము అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు చేశారని బుగ్గన గుర్తుచేశారు. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి ప్రభుత్వానికి అడ్డుపడే శక్తి, సామర్ధ్యాలు తమకు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎక్కడో జర్మనీలో మెయిల్స్ రాస్తే.. మీకున్న శక్తిని ఆపగలుగుతున్నారా అని అడిగారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications