జగన్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పలాస మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు శనివారం మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న జగన్:మళ్లీ వివాదం ! ఎందుకంటే? | Oneindia Telugu

విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. జగన్నాయకులు అంత్యక్రియలు గ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి.

YSRCP leader juttu jagannayakulu passes away

కాగా, కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. జగన్నాయకులు 2009 నుంచి 2014 వరకు పలాస ఎమ్మెల్యేగా పని చేశారు. జగన్నాయుకులు మృతిపట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP leader juttu jagannayakulu passed away on Saturday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి