ఎన్టీఆర్ మరణం, జూనియర్ ప్రమాదాలపై వైసీపీ నేత కాకాణి ప్రశ్నలు..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కారుకు జరిగిన ఓ ప్రమాదాన్ని కుట్రలో భాగమేనంటూ అధికార కూటమిలో పార్టీలు చేస్తున్న విమర్శలకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయమ్మ కారు ప్రమాదంపై
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మాటలు సంస్కారహీనంగా ఉన్నాయన్నారు. వీరిద్దరూ వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు.
రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదం కుట్ర అంటున్నారని, ఎన్టీఆర్ మరణం, జూ.ఎన్టీఆర్ కారు ప్రమాదం కుట్ర కాదా అని చంద్రబాబు, పవన్ ను కాకాణి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి గతంలో ఒక ఆడబిడ్డ రోడ్డెక్కిందని, తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. ఆ సంగతులన్నీ మర్చిపోయారా అంటూ అడిగారు. షర్మిలకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పిస్తామన్న పవన్.. అసలు ఆ అవసరం పవన్‌కళ్యాణ్‌కు ఏముందని నిలదీశారు. తొక్కి పెట్టి నారా తీస్తానంటున్న డిప్యూటీ సీఎం పవన్.. ఆ పని సీఎం, ఆయన కొడుకు ఇద్దరికీ చేయాలన్నారు. ఎందుకంటే ఎన్నికల హామీలేవీ అమలు చేయడం లేదన్నారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ కాస్తా.. సూపర్ ప్లాఫ్‌గా మారిందని కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కోటి 47 లక్షల రేషన్ కార్డులుంటే వాటిరో అరకోటి మందికి మొండిచేయి చూపుతూ పథకాన్ని ఎగ్గొట్టారని, మరోవైపు మిగిలిన వారు కూడా తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేస్తే, తర్వాత అకౌంట్లో్ల వేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజలను దగా చేస్తోందని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications