చంద్రబాబు అమలు చేసేది ఆ రెండు పథకాలే..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. రేపు (సోమవారం) నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి దూరంగా ఉంటున్న మాజీ సీఎం జగన్ అనూహ్యంగా బడ్జెట్ సమావేశాల కు హాజరు కావాలని నిర్ణయించారు. ఇక.. పథకాల అమలు కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగు తోంది. బడ్జెట్ లో పథకాలకు నిధులు కేటాయిస్తారనే ప్రభుత్వ వర్గాలు చెబుతున్న వేళ కొత్త అంశం వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది.
కన్నబాబు బాధ్యతలు
ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అంశం పైన వైసీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి కన్నబాబు తాజాగా వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా నియమితుల య్యారు. బాధ్యతలు స్వీకరించిన కన్నబాబు పార్టీ శ్రేణులంతా ఒక టీమ్ వర్క్‌గా పనిచేయాలని పిలుపిచ్చారు. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి విశాఖ యువత రోడ్డు ఎక్కితే... రాష్ట్రం అంతా ఈ సమస్య తీవ్రత తెల్సిందని అన్నారు. అసలైన యువగళం ఎలా ఉంటుందో... పాలకులకు తెలి సిందని వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా వైసీపీ ప్రజల పక్షాన పోరాడు తుందని కన్నబాబు స్పష్టం చేశారు.

ఈ రెండు పథకాలే
పథకాల అమలు విషయంలోనూ కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం వాటిని మత పెట్టి బీరువాలో పెట్టేసారని ఎద్దేవా చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు రెండు పథకాలను మాత్రమే అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రన్న పగ, దగా పథకాలు మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. త్వరలోనే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన చేస్తానని కన్నబాబు వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగన్ సైన్యంలా ముందుకు కదులుతామని... తమది జగన్ సేన అని చెప్పిన కన్నబాబు.. రాష్ట్రంలో ఉన్న అన్ని సేనల కంటే జగన్ సేన చాలా బలమైనదని చెప్పుకొచ్చారు.
రాజీనామాల పై
పార్టీకి కీలక నేతలు రాజీనామాల పైన కన్నబాబు స్పందించారు. పార్టీని కొంతమంది విడిచిపె ట్టడం, మరి కొంతమంది రావడం రాజకీయాలలో సర్వసాధారణమని పేర్కొన్నారు. వెళ్లిన వారు వెనక్కి వస్తారని...కొత్తగా ఎవరూ వెళ్లరని కన్నబాబు స్పష్టం చేశారు. జగన్ ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసారని.. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకార నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్యానించారు. తొమ్మది నెలల కాలంలో లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు ఎందుకు చేసారో తెలియదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పోరాటాల గడ్డ అని.. రానున్న రోజుల్లో వైసీపీ మరింతగా ప్రజా పోరాటాలు చేస్తుందని కన్నబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications