కొడాలి నాని నోట బాబు మాట: 'డేరా బాబా వద్ద కంటే జగన్ వద్ద ఎక్కువ డబ్బు'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు పలుమార్లు చెప్పారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అదే చెబుతున్నారు.

నిధులివ్వడం లేదు: మోడీపై బాబు అసహనం, జగన్‌కు 20 శాతం ఆఫర్

ఏడాది ముందే ఎన్నికలు

ఏడాది ముందే ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది ముందే ఎన్నికలు వస్తాయని కొడాలి నాని జోస్యం చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిందని చెప్పారు. అధికార బలంతో ఏమైనా చేయవచ్చునని వారు భావిస్తున్నారని ధ్వజమెత్తారు.

వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డిపై చర్యలు

వంగవీటి రంగాపై గౌతమ్ రెడ్డిపై చర్యలు

కొంతమంది అధికార పార్టీ నేతలు ఎక్కడ భూములు కనిపించినా కబ్జా చేస్తున్నారని కొడాలి నాని తీవ్ర ఆరోపణలు చేశారు. దివంగత వంగవీటి రంగా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతమ్ రెడ్డి వ్యాఖ్యలను తాము ఖండించామని, ఆయనను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశామని చెప్పారు.

డేరా బాబా వద్ద కంటే జగన్ వద్ద ఎక్కువ నిధులు

డేరా బాబా వద్ద కంటే జగన్ వద్ద ఎక్కువ నిధులు

డేరా బాబా వద్ద దొరికే నిధుల కన్నా ఇడుపులపాయలో ఎక్కువ‌గా దొరుకుతాయని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అటువంటి అవినీతిప‌రులు చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం ఏమిటని ప్రశ్నించారు.

ప్రధాని పదవి వదులుకున్నాడు

ప్రధాని పదవి వదులుకున్నాడు

చంద్రబాబు నాయుడు ప్ర‌ధాని ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దులుకున్నారని బుద్ధా వెంకన్న అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 సీట్ల‌నూ టిడిపికే అప్ప‌జెప్పి ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు కానుక‌ను ఇస్తార‌న్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party leader and Gudivada MLA Kodali Nani talk about early elections in Andhra Pradesh. He also condemned Gautham Reddy comments on Vangaveeti Ranga.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి