ఆలయాల కూల్చివేత: చంద్రబాబుకు పీఠాధిపతుల సెగ, ఖండించిన వైసీపీ
అమరావతి: బెజవాడలో ఆలయాలు తొలగింపు అంశంలో ఏపీ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తొలగించే విషయంలో ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకుంటామని అన్నారు.
దీనిపై ఇప్పటికే మంత్రులతో కమిటీ వేశామని, తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపై ఎటువంటి అనుమతి లేకుండా అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని తొలగించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. పుష్కరాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రోడ్ల విస్తరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు.

ఒకవేళ తప్పనిసరిగా దేవాలయాలు తొలంగించాల్సి వస్తే, వాటికి సమీపంలోనే కొత్త వాటిని నిర్మిస్తామని ఆయన తెలిపారు. దేవాలయాలు తొలగింపు విషయంలో బీజేపీ, టీడీపీ నేతలు ఉద్రిక్తలకు పోకుండా కొంత సంయమనం పాటించాలని ఆయన సూచించారు
ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న పీఠాధిపతులు
అభివృద్ధి పేరిట బెజవాడలో పవిత్రమైన దేవాలయాలను తొలగించడం ఏంటని హిందూ ధర్మ పరిరక్షణ సమితి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆలయాల తొలగింపునకు నిరసనగా బెజవాడలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సోమవార భారీ ర్యాలీ నిర్వహించింది.
కేశినేని నాని క్షమాపణ చెప్పాల్సిందే: వంగవీటి రాధా, బెజవాడ బంద్
ఆ తర్వాత తెనాలి రోడ్డులో ధర్మో రక్షతి రక్షితః పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు పీఠాధిపతులు మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి ఆలయాలను కట్టిస్తామని చెబుతోన్న మాటలను తాము నమ్మబోమని చెప్పారు.

రాజకీయనాయకులు ఇస్తోన్న హామీపై నమ్మకం ఎంతవరకని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలు చేతులు కాలిన తరువాత అకులు పట్టుకున్నట్లు ఉన్నాయని వారు ఎద్దేవా చేశారు. 'మసీదు కూల్చేటప్పడు మూడు నెలలు టైం ఇచ్చారు.. ఆ భయం హిందూ దేవాలయాలపై లేదా..?' అని పీఠాధిపతులు ప్రశ్నించారు.
దేవాలయాల కూల్చివేత తమకు తెలియకుండా జరిగిపోయిందంటూ మంత్రులు మాట్లాడుతున్నారని వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అంటూ ధ్వజమెత్తారు. ఈ సభకు పీఠాధిపతులు, ఆరెస్సెస్, వీహెచ్‌పీ కార్యకర్తలతో పాటు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో పాటు ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు.
అభివృద్ధి పేరుతో దేవాలయాల కూల్చివేత మంచిది కాదు: వైసీపీ
అభివృద్ధి పేరుతో దేవాలయాలను కూల్చివేయడాన్ని తాము ఖండిస్తున్నట్లు వైసీపీ నేత పార్థసారథి తెలిపారు. పుష్కరాల సమయం ఎప్పుడో చాలా ముందుగానే నిర్ణయం అవుతుందని ఇప్పటికిప్పుడు.. హిందువులు పరమ పవిత్రంగా భావించే పుష్కరాల సమయంలో హిందూ ఆలయాలను ఇష్టారాజ్యంగా కూల్చివేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.

తప్పంతా వారిదే!: బీజేపీ రాకతో తలొగ్గిన చంద్రబాబు ప్రభుత్వం (ఫోటోలు)
రోడ్ల విస్తరణలో భాగంగా ఇష్టారాజ్యంగా గుళ్లు, మసీదులు పగలగొట్టేస్తామంటుంటే ఊరుకునేది లేదన్నారు. దేవాలయాలను ధ్వంసం చేసిన దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ఈ విషయంలో ఏ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications