పోతుల సునీత సోదరుడి దారుణ హత్య

Pothula Sunitha: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లాలో ఈ ఘటన సంభవించింది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నారు.

హతుడి పేరు పూజారి రాము. వయస్సు 59 సంవత్సరాలు. పోతుల సునీతకు స్వయానా సోదరుడు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పెండేకల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆయన హత్యకు గురయ్యారు. పోతుల సునీత స్వస్థలం కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలి. ఆమె సోదరులు రాము, లెనిన్ బాబు అక్కడే నివసిస్తోన్నారు.

YSRCP leader Pothula Sunitha brother Ramu was murder in Kurnool

రాము గతంలో మావోయిస్టు దళంలో పని చేశారు. సుమారు ఆరు సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాతంలో గడిపారు. అనంతరం పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. జన జీవన స్రవంతిలో కలిశారు. అంతకుముందు- ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగానూ రాము పని చేశారు.

కొంతకాలంగా మానసిక పరిస్థితి సరిగ్గా ఉండట్లేదని తెలుస్తోంది. శనివారం రాత్రి హత్యకు పెండెకల్ రైల్వే స్టేషన్ సమీపంలో హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి చంపారు. లెనిన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుగ్గలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు పాల్పడిందెవరనేది త్వరలోనే నిర్ధారిస్తామని, దీని వెనుక గల కారణాలను అన్వేషిస్తోన్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+