ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకు- రోజా చెప్పింది నిజమేనా?

Roja: ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలల వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొన్ని వివాదాస్పద నిర్ణయాలను తీసుకోవడం దీనికి కారణమైంది.

దీనిపై అధికార టీడీపీ కూటమి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్యుద్దం సాగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ చేసిన విమర్శలను మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధురాలు ఆర్ కే రోజా తిప్పి కొట్టారు. ఘాటుగా విమర్శలు గుప్పించారు.

YSRCP leader Roja lashes out at Chandrababu led NDA govt in Andhra Pradesh

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి మొత్తం 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని సత్యకుమార్ అన్నారు. వాటి నిర్మాణం మొదలుపెట్టి నాలుగేళ్లు నిండినప్పటికీ ఒక్కటి కూడా పూర్తి కాలేదని, సగానికి పైగా పునాదుల దశలోనే ఉన్నాయని చెప్పారు.

కళాశాల హాస్టల్ భవనాలు పూర్తి చేయకుండా గత సంవత్సరమే ఆర్భాటంగా రాజమండ్రి వైద్య కళాశాల ప్రారంభించారని సత్యకుమార్ విమర్శించారు. ఈ ఏడాది రెండో సంవత్సరం విద్యార్థులకు తాత్కాలిక భవనాలలోనే తరగతులు నడపాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

జూలైలోనే మెడికల్ కౌన్సిల్ వాటికి అనుమతి నిరాకరించిందని సత్యకుమార్ గుర్తు చేశారు. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు. 48 శాతం బోధనా సిబ్బంది లేరన్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్టుందని ఎద్దేవా చేశారు.

ఇలాంటి అబద్దాలను ప్రచారం చేస్తున్నారనే కారణంతోనే రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి 151 నుంచి 11 సీట్లకు దించారని, అయినా బుద్ధి తెచ్చుకోకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా మారాలని, ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

దీనికి రోజా ఘాటుగా స్పందించారు. జగన్ చేసిన మంచిపై ప్రజల్లో చర్చ జరుగుతుందని ఉద్దేశంతో ఏకంగా ఆయన పేదలకు, ప్రజలకు చేసిన వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణం అంటూ విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని అన్నారు.

పులివెందుల మెడికల్ కళాశాలకు కేటాయించిన సీట్లను రద్దు చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు తన పాలన లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకురాలేదని, తమ ప్రభుత్వ నిర్మించిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరంగా అభివర్ణించారు.

జగన్‌పై ఉన్న ఈర్ష్య, ద్వేషంతో చంద్రబాబు ఇలా మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేయాలనుకోవడం, ప్రతిభ గల పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనుకోవడం అన్యాయమని చెప్పారు. వాటన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలంటూ వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+