• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం..!! సజ్జల వ్యాఖ్యల వెనుక - పక్కా వ్యూహాత్మకంగా..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్నారా. ఏడాది ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా. కొంత కాలంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం సాగుతున్నా..దీనిని అధికార పార్టీ నేతలు అటువంటి అవకాశం లేదని చెబుతూ వచ్చారు. కానీ, ఇప్పుడు పార్టీ కీలక నేత సజ్జల చేసిన వ్యాఖ్యలతో మరోసారి ముందస్తు ఎన్నికల పైన స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు .. మంత్రివర్గ ప్రక్షాళన.. పార్టీ పరంగా పదవులు.. సీఎం జగన్ జిల్లాల పర్యటనలు... 2024 ఎన్నికల టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్.. పార్టీ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

ప్రజల్లోనే సీఎం జగన్..చంద్రబాబు

ప్రజల్లోనే సీఎం జగన్..చంద్రబాబు

తానే జిల్లాల పర్యటన సమయంలో ప్రభుత్వం పైన ఆరోపణలు... ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతున్నారు. ఇదే సమయంలో..మూడు సంస్థలతో క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన సర్వేలు చేయిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం లోని వాస్తవ ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు పైన మూడు స్థాయిలో ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉన్నవారికే సీటు ఇస్తామని తేల్చి చెప్పారు. అందుకు ప్రజాదరణలో కింద స్థాయిలో ఉన్న వారిని తమ పని తీరు మెరుగు పర్చుకోవటానికి గడప గడపకు వైసీపీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారుద. ఇక, తాజాగా పార్టీ ముఖ్య నేతలు సజ్జల - విజయ సాయిరెడ్డి భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్ వ్యూహాల పైన చర్చించారు. ఈ ఇద్దరు ఇప్పుడు సీఎం జగన్ 2024 మిషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా

ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా

ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలు - నేతల సమన్వయం విషయంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రజా ఉద్యమం చేయాలని పిలుపునివ్వటం పైన సజ్జల స్పందించారు. వారు గతంలోనే కలిసే ఉన్నారని.. ఇప్పుడు కలుస్తున్నారని చెబుతూ..కీలక వ్యాఖ్యలు చేసారు. ఏడాది..రెండేళ్లలో ఎన్నికలకు పోబోతున్నామంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ బలోపేతం అవుతోందని.. ప్రభుత్వం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లిందని విశ్లేషించారు. కష్టకాలంలోనూ సీఎం జగన్ చేసిన పథకాలు అమలు అవుతున్నాయని వివరించారు. ప్రజల్లో తమ పట్ల ఆదరణ పెరగిందని చెప్పారు. ఇది పొగరుతో చెబుతున్నది కాదని.. వినయంగా చెబుతున్నామని పేర్కొన్నారు.

ముందస్తు ఎన్నికలు ఖాయమేనా

ముందస్తు ఎన్నికలు ఖాయమేనా


కొద్ది రోజుల క్రితం తమకు ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు పూర్తి సమయం అధికారంలో ఉంటామని.. చంద్రబాబు పార్టీ కేడర్ లో లేని జోష్ తెచ్చేందుకు ముందస్తు ఎన్నికలు అంటూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక, మాజీ మంత్రి కొడాలి నాని సైతం ముందస్తు ఎన్నికల అవకాశం లేదని గతంలో తేల్చి చెప్పారు. అటు టీడీపీ నేతలు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 160 సీట్లు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జగన్ సీఎంగా వైఫల్యం చెందారంటూ వివరిస్తున్నారు. ఇప్పుడు... ప్రతిపక్ష పార్టీల పొత్తు వ్యవహారం టీడీపీ - జనసేన కలవటం ఖాయమనే అంచనాల్లో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే, బీజేపీ ఆలోచన స్పష్టం కావాల్సి ఉంది.

ప్రతిపక్షాలకు జలక్ ఇచ్చే లక్ష్యంతో

ప్రతిపక్షాలకు జలక్ ఇచ్చే లక్ష్యంతో

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానని గతంలోనే చెప్పారు. ఇక, ఇప్పుడు వైసీపీ నేతలు ముందస్తు ఎన్నికల పైన సంకేతాల ద్వారా ప్రతిపక్ష పార్టీలకు జలక్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొత్తుల అంశాలే తేలకపోవటం.. టీడీపీ - జనసేన కలిసినా.. బీజేపీ కలిసే అవకాశాలు తక్కువగా ఉండటం.. ఇతర పార్టీలు వీరితో జత కలిసే ఛాన్స్ లేకపోవటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి..అంతిమంగా విజయం సాధిస్తామని లెక్కలు కడుతున్నారు. అందులో భాగంగానే.. ముందస్తు ఎన్నికల పైన వ్యూహాత్మకంగానే వైసీపీ నేతలు వ్యవహిస్తున్నారనే చర్చ మొదలైంది. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని.. ఈ సారి అధికారంలోకి వస్తే ఇక టీడీపీకి భవిష్యత్ ఉండదని బలంగా నమ్ముతున్న సీఎం జగన్.. ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Early elections in AP is for sure according to YCP leader Sajjala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X