వల్లభనేని వంశీ అరెస్ట్..!!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ ప్రోద్బలం ఉందని ఖాకీలు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన కొంతమంది నుంచి స్టేట్మెంట్‌నుు పోలీసులు రికార్డ్ చేశారు. హైదరాబాద్ నుంచి వంశీ గన్నవరం వస్తుండగా పోలీసులు గుర్తించారు. గన్నవరం లోని ఇంటి వద్ద వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడిచేసి నిప్పుబెట్టారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టారు. అయితే వంశీ ప్రోద్బలంతో ఈ ఘటనలో గాయపడిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అర్ధరాత్రి వరకూ జీపులో వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పారు.

YSRCP leader Vallabhaneni Vamsi arrest in TDP office Attack case at Gannavaram

కాగా.. దాడికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్‌ ముదునూరి సత్యవర్ధన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 143, 147, 148, 435, 506 రెడ్‌విత్‌ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) సెక్షన్ల కింద కేసు (క్రైమ్‌ నంబర్‌ 137/2023) నమోదు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేారు. వంశీ కోసం ప్రత్యేకంగా మూడు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసారు. వంశీ విదేశాలకు వెళ్లారనే ప్రచారం జరిగింది. అయితే, గన్నవరంలో ఇంట్లో ఉన్న వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+