న్యాయవాది సిద్దార్ధ లూథ్రాపై వైసీపీ నేతల ఫిర్యాదు..!!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఆయన తరపు కోర్టులో వాదనల కోసం సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూద్రా విజయవాడకు వచ్చారు. ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. తరువాత హైకోర్టులో రిమాండ్ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని పిటీషన్ ధాఖలు చేసారు. ఈ సమయంలోనే వైసీపీ నేతలు సిద్దార్ధ లూద్రాపైన పోలీసులకు ఫిర్యాదు చేసారు.

చంద్రబాబు తరపు వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్దార్ధ లూద్రాపై రాజమండ్రి వైసీపీ నేతలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. హైకోర్టులో చంద్రబాబు స్కిల్ కేసు క్వాష్ చేయాలని దాఖలు చేసిన పిటీషన్ ను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసారు. ఆ సమయంలో లాయర్ సిద్దార్థ లూధ్రా చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఎంత ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేనప్పుడు కత్తి పట్టుకుని పోరాటం చేయడమే సరైనది అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్లో షేర్ చేశారు. ఈ రోజు ఇదే మా నినాదం అని ఆయన పేర్కొన్నారు. లూధ్రా ట్వీట్ పై పలువురు స్పందించారు. లాయర్‌కు కత్తి కంటే పెన్నే పవర్ ఫుల్ అని ఓ నెటిజన్ చెప్పడంతో .. లూధ్రా స్పందించారు. లాయర్‌కు కత్తి అంటే.. చట్టమేనన్నారు. లా అనే ఆయుధమే లాయర్‌కు ఉంటుందని వివరించారు.

YSRCP leaders complaints on Chandra Babus Lawyer Siddath Luthra over his Tweet

ఇప్పుడు ఈ ట్వీట్ తో లూధ్రా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ రాజమహేంద్రవరం పోలీసు స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ రావు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. చంద్రబాబు పక్షాన వాదిస్తున్న లూధ్రా ..ఆశించిన తీర్పు రాని కారణ:గా ఓ మత ప్రవక్త సూక్తిని ఉదహరించి ఆయుధాలతోనే పని జరుగుతుందనే వ్యాఖ్య చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలను హింసకు ప్రేరేపించటం నేరమని..దీని పైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి కొనసాగింపుగా గురువారం లూధ్రా మరో ట్వట్ చేసారు. ప్రపంచంలో ఎదురయ్యే అవహేళనలుచ అపహాస్యాలు పట్టించుకోకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వహించాలని వివేకానంద కర్మయోగిలో చెప్పిన సూక్తిని ట్వీట్ లో ప్రస్తావించారు.

ఇక, హైకోర్టు క్వాష్ పిటీషన్ 19వ తేదీకి వాయిదా వేయటంతో లూధ్రా రాజమండ్రి జైలులో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లారు. ఇటు ఇతర కేసుల్లో ఎఫ్ఐఆర్ లలో చంద్రబాబు పేరు ఉండటంతో వాటి పైన బెయిల్ పిటీషన్లు దాఖలయ్యాయి. అటు స్కిల్ స్కాంలో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటి పైన ఈ రోజు సీఐడీ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. సీఐడీ కౌంటర్ దాఖలు చేస్తుందా..సమయం కోరుతుందా.. కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+