ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా దున్నపోతుల ర్యాలీ, ఉద్రిక్తత

Subscribe to Oneindia Telugu

అనంతపురం: ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నియోజకవర్గ సమస్యలు తీర్చాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హిందూపురంలో బాలకృష్ణకు వ్యతిరేకంగా దున్నపోతులతో ర్యాలీ నిర్వహించారు.

పట్టణంలో తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని, రహదారులకు మరమ్మతులు చేయాలని, ఆగిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక, దున్నపోతులపై నినాదాలు రాసి, వాటిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

YSRCP leaders protests against MLA Balakrishna

ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది.

balayya

ఆ తర్వాత నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించచారు. దీంతో వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party leaders on Wednesday protested against MLA Balakrishna in Hindupur.
Please Wait while comments are loading...