రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల ఓటు మాకే: ఆది

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థులకు ఓటేసే అవకాశం ఉందని ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఎంపీలు రాజీనామా చేస్తే బిజెపికే లాభం, కేంద్రంపై అంచెలంచెల పోరుకు బాబు ప్లాన్

వైసీపీ నుండి టిడిపిలో చేరకున్నా టిడిపి అభ్యర్థులకు ఓటేస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు. కేంద్రం నుండి ఏపీకి నిధులు రాకపోతే ఎన్డీఏ నుండి బయటకు వచ్చేందుకు వెనుకాడబోమని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు.

పురంధరేశ్వరీకి టిడిపి కౌంటర్: రెవిన్యూలోటుకు కొత్త నిర్వచనం

ఏపీ రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా విషయమై బిజెపి అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి టిడిపి వైదొలిగింది. బిజెపి మాత్రం ఏపీకి నిధులను ఇచ్చినట్టు చెబుతోంది.

ఎన్డీఏలోనే ఉంటారా, వైదొలుగుతారా, బాబు నెక్ట్స్ ప్లాన్ ఏమిటి?

ఏపీ రాష్ట్రానికి నిదుల విషయమై టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. రెండు పార్టీల నేతలు తమ వాదనను సమర్ధించుకొంటున్నారు. ఏపీకి బిజెపి చేసిన అన్యాయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.

ఎన్డీఏ నుండి కూడ బయటకు

ఎన్డీఏ నుండి కూడ బయటకు


కేంద్ర ప్రభుత్వం నుండి తమ మంత్రులు వైదొలిగారని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధుల విషయమై ఒత్తిడిని పెంచనున్నట్టు చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యేలోపుగా కేంద్రం నుండి సానుకూలంగా నిర్ణయం వస్తోందని మంత్రి అబిప్రాయపడ్డారు. లేకపోతే ముఖ్యమంత్రి సముచిత నిర్ణయం తీసుకొంటారని చెప్పారు.

జగన్ మాటలకు విశ్వసనీయత లేదు

జగన్ మాటలకు విశ్వసనీయత లేదు


వైఎస్ జగన్ మాటలకు విశ్వసనీయత లేదని ఏపీ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఏపీ రాష్ట్రాభివృద్ది విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నశలు కష్టపడుతున్నారని చెప్పారు. విభజన చట్టాన్ని అమలు చేయాలన్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేస్తారు

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేస్తారు


రాజ్యసభ ఎన్నికల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిిపి అభ్యర్థికి ఓటేస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారో లేదో చెప్పలేమన్నారు. కానీ, టిడిపి అభ్యర్థికి ఓటేస్తారని మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు.

గ్రేస్ మార్కులివ్వాలి

గ్రేస్ మార్కులివ్వాలి

రాష్ట్రాభివృద్ది కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు.బాబు చేస్తున్న కృషికి కేంద్రం నుండి గ్రేస్ మార్కులు ఇవ్వాల్సిందేనని చెప్పారు. రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన విషయాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Adi Narayana Reddy expressed confidence that even YSRCP members will vote for Telugu Desam Party (TDP) candidate for Rajya Sabha. He said that they would be happy to express their individual opinions, as some of them are against their leader,

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి