మా పార్టీ నేతల భార్యలు కలవలేదు: శోభా నాగిరెడ్డి

Shobha Nagi Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన మహిళల్లో తమ పార్టీ నేతలు బాలినేని శ్రీనివాస రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, సోమయాజులు సతీమణులు ఉన్నట్లు వచ్చిన వార్తలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి ఖండించారు. మహిళలు రాష్ట్రపతిని కలిసిన అంశంపై కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనమని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు మళ్లీ పర్యటన చేస్తే సీమాంధ్ర ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే సత్తా లేకనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. క్విడ్ ప్రోకో జరగలేదని మొదటి నుంచీ తాము చెబుతూనే ఉన్నామని, సిబిఐ కూడా ఇప్పుడు అదే తేల్చిందని ఆమె అన్నారు.

రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి, పాలన పూర్తిగా అస్తవ్యస్తం కావడానికి అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కారణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు విమర్సించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రం అధోగతి పాలవుతోందని వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

సమైక్య ఉద్యమం వల్ల సామాన్యులు, ఉద్యోగులు, రైతులు రోడ్డున పడ్డప్పటికీ చంద్రబాబు, కిరణ్ మాత్రం తమ తమ పదవులను పట్టుకుని వేలాడుతున్నారని వారు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటన ఎందుకో చెప్పలేకపోవడం చంద్రబాబు లోపాయికారీ రాజకీయాలకు నిదర్శనమని వారన్నారు.

జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఆ వాస్తవాన్ని చెప్పలేకపోతున్నారని వారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు చేయవద్దని కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు తమ తమ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు చెబుతూ తప్పుదారి పట్టిస్తున్నారని వారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+