ఎక్స్ స్పేస్ లో జగన్ పై అసభ్యకర వ్యాఖ్యలు: రాష్ట్రం బయట ఉన్నా వదిలిపెట్టని వైసీపీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తోన్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధమైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు చెందిన జనసేనకు చెందిన కొందరు మద్దతుదారులు పరిధులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించేలా చర్యలు ఉంటాయని వైసీపీ లీగల్ సెల్ హెచ్చరించింది.

ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిగత దాడులు, సైబర్ వేధింపులపై వైసీపీ లీగల్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. అన్నా లెజ్నెవాతో విడాకుల అనంతరం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి గానీ, ఆయన కుటుంబంపై గానీ తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యూజర్లు ఎవరూ కూడా స్పందించకూడదని పార్టీ అధిష్టానం ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.

YSRCP Legal Cell lodged complaint against X Users who reportedly criticized YS Jagan and his Family

పార్టీ నాయకత్వం ఇచ్చిన హెచ్చరికలు, ఆదేశాలకు కట్టుబడి వైసీపీ నాయకులు, సోషల్ మీడియా విభాగానికి చెందిన శ్రేణులు సంపూర్ణ సంయమనం పాటించారని లీగల్ సెల్ వెల్లడించింది. కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో కొందరు జనసేన పార్టీ మద్దతుదారులు మాత్రం జగన్ కుటుంబమే లక్ష్యంగా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, ఆన్ లైన్ లైవ్ చర్చల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారని పేర్కొంది.

శబరిమల ఆలయంలో వారికి ప్రవేశం లేదు: తేల్చి చెప్పిన కేరళ ప్రభుత్వం, టీడీబీ
శబరిమల ఆలయంలో వారికి ప్రవేశం లేదు: తేల్చి చెప్పిన కేరళ ప్రభుత్వం, టీడీబీ

సోషల్ మీడియాలో పరిమితులు దాటి అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు లీగల్ సెల్ తెలిపింది. చెన్నైలో నివసించే త్రినాథ్ కుమార్ ఇమ్మని అలియాస్ దమ్ మసాలా (@Dummasala) అనే ఎక్స్ అకౌంట్ నిర్వాహకుడిపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. మహిళలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఆన్ లైన్ లో దుష్ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయిస్తున్నామని పేర్కొంది.

సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమైన చిరుతపులి: ఇంట్లోవాళ్ల పైప్రాణాలు పైనే పోయుంటాయ్
సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమైన చిరుతపులి: ఇంట్లోవాళ్ల పైప్రాణాలు పైనే పోయుంటాయ్

లైవ్ స్పేస్ నిర్వహిస్తూ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరొక వ్యక్తి వివరాలను కూడా వైసీపీ లీగల్ సెల్ సేకరించింది. ఈ వ్యాఖ్యలకు బాధ్యుడైన వ్యక్తిని అలమూరి రాఘవేంద్ర నాయుడుగా గుర్తించినట్లు తెలిపింది. @Glass19Mar, @TYSON21AP, @werty1234up అనే వివిధ ప్రొఫైల్స్ ద్వారా సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారానికి పాల్పడినట్లు గుర్తించినట్లు వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+