వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ క్లోజ్ ఫ్రెండ్- కీలక మార్పు..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా మారుతోంది. జగన్ ప్రచారం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. కూమటిలో సీట్ల సర్దబాటు పూర్తయింది. అభ్యర్థుల ప్రకటన చేసారు. కానీ, కొన్ని నియోజకవర్గా ల్లో మార్పులు చేయనున్నారు. వైసీపీలోనూ అభ్యర్థుల మార్పు పైన కసరత్తు జరుగుతోంది. గుంటూరు ఎంపీ అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మరో నియోజకవర్గంలోనూ మార్పు ఉంటుందని చెబుతున్నారు. దీంతో, కొత్తగా ఎవరికి ఛాన్స్ దక్కుతుందని కీలకంగా మారుతోంది.

అభ్యర్థుల మార్పు
ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. కూటమిలో మూడు పార్టీల అభ్యర్థుల్లో కొందరు మారుతారని ప్రచారం జరుగుతుంది. గోదావరి జిల్లాల తో పాటు కడపలోను అభ్యర్థుల మార్పు ఉంటుందని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు మూడు పార్టీల నుంచి ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు.

YSRCP likely to change Guntur MP Candidate chances to field Kadiri Baburao in place of Rosaiah

నామినేషన్ వేసే వరకు గెలుపే ప్రామాణికంగా అవసరమైన నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందని ఇప్పటికే పార్టీల అధినేతలు చెబుతూ వచ్చారు. అందులో భాగంగా వైసిపి లోను కొందరి మార్పు ఉంటుందనే ప్రచారం తల మీదకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర సమయంలోనే జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలు బలాలు, బలహీనతల పైన ఆరా తీస్తున్నారు. కొన్ని మార్పులు తప్పవని ప్రచారం పార్టీలో జరుగుతుంది.

కొత్త అభ్యర్థుల పై కసరత్తు
గుంటూరు ఎంపీగా సెట్టింగ్ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసిపి ప్రకటించింది. రోశయ్యకముందు ఉమ్మారెడ్డి కుమారుడు వెంకటరమణను గుంటూరు ఎంపీగా జగన్ ఖరారు చేశారు. తర్వాత మారిన సమీకరణలో భాగంగా వెంకటరమణ స్థానంలో రోశయ్యను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు రోశయ్య అయిష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది.

తాజాగా పార్టీ ముఖ్య నేత సజ్జలను కలిసి తనకు గుంటూరు పశ్చిమం లేదా పొన్నూరు స్థానం కేటాయించాలని కోరినట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థిగా మరొకరిని ఎంపిక చేయాలని వివరించినట్లు తెలుస్తోంది. దీంతో గుంటూరు ఎంపీగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేది వైసిపిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సీటు దక్కేదెవరికి
సామాజిక సమీకరణాల్లో భాగంగా గుంటూరు ఎంపీ స్థానం కాపు వర్గానికి జగన్ కేటాయించారు. ఇప్పుడు రోశయ్య పోటీకి సుముఖంగా లేకపోవడంతో అదే వర్గానికి చెందిన మరో నేత పేరు ప్రచారంలోకి వచ్చింది. సినీ హీరో నందమూరి బాలకృష్ణ సన్నిహితుడిగా పేరున్న కదిరి బాబురావు ను బరిలోకి దింపుతారని చర్చ మొదలైంది. 2020లో కదిరి బాబురావు వైసీపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు. దీంతో గుంటూరు నుంచి బాబురావును బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతుంది.

అయితే ఆయన నాన్ లోకల్ కావడంతో అవకాశం ఇస్తారా అనేది సందేహంగానే కనిపిస్తుంది. అదే సమయంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు కూడా తెరమీదకు వచ్చింది. ఉగాది తర్వాత సీఎం జగన్ గుంటూరు ఎంపీ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రచారంలో ఉన్న ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తారా లేక కొత్తవారిని ఖరారు చేస్తారా అనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+