స్పీకర్ పోడియంపైకి శ్రీదేవి, కోటంరెడ్డి - పేపర్లు చింపి, గందరగోళం..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సమయంలోనే ఉద్రిక్తత ఏర్పడింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. టీడీపీ చంద్రబాబు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టు ముట్టారు. దీని పైన మంత్రి అంబటి జోక్యం చేసుకొని టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. నందమూరి బాలయ్య మీసం మెలేయటంతో గందరగోళం మొదలైంది. వైసీపీ నుంచి టీడీపీకి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు నిరసనలో పాల్గొన్నారు.

ఏపీ శాసనస సమావేశాల ప్రారంభ సమయంలోనే గంరదగోళం ఏర్పడింది. చంద్రబాబు పై కేసులు ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు నినదించారు. స్పీకర్ పోడియం పైకి వెళ్లి నినాదాలు హోరెత్తించారు. ఆ సమయంలో మంత్రి బుగ్గన జోక్యం చేసుకొని తాము చంద్రబాబు కేసులపై చర్చకు సిద్దంగా ఉన్నామని..బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఆ సందర్భంలో జోక్యం చేసుకున్న మంత్రి అంబటి రాంబాబు టీడీపీ సభ్యుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా సభలో టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని..తమ సభ్యులు కూడా సహనం కోల్పోయే అవకాశం ఉందని అంబటి హెచ్చరించారు. టీడీపీ సభ్యులు కోర్టులో కేసుల సంగతి చూసుకోవాలని వ్యాఖ్యానించారు.

YSRCP Members angry over Balakrishna behaviour, TDP Protest at Speaker Podium

ఆ సమయంలో నందమూరి బాలయ్య మీసం తిప్పారు. దీని పైన అంబటి సీరియస్ అయ్యారు. రా చూసుకుందాం అంటూ రెండు వైపులా హెచ్చిరిస్తూ వ్యాఖ్యలు మొదలయ్యాయి. టీడీపీ సభ్యులు బాలయ్య కు మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో వైసీపీ సభ్యులు ముందుకు దూసుకెళ్లారు. వైసీపీ శ్రీకాళహస్తి సభ్యుడు బియ్యపు మధుసూధన రెడ్డి తొడ గొట్టారు. దీంతో, రెండు పక్షాల నుంచి సవాళ్లు మొదలయ్యాయి. మీసాలు సినిమాల్లో తిప్పాలంటూ అంబటి పేర్కొన్నారు. ఈ సమయంలో రెండు పక్షాల నుంచి సభ్యులు దూసుకు రావటంతో గందరగోళం ఏర్పడింది. దీంతో, స్పీకర్ సభను వెంటనే వాయిదా వేసారు. బీఏసీ సమావేశంలో సమావేశ అజెండా ను ఖరారు చేయనున్నారు. చంద్రబాబు కేసుల గురంచి వివరించేందుకు సిద్దమని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, వైసీపీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ రోజు సభలో టీడీపీ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ పోడియం వద్ద చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేసారు. పేపర్లు చింపి విసిరేసారు. స్పీకర్ వద్ద ఉన్న మానిటర్ ను తొలిగించే ప్రయత్నం చేసారు. తమ పార్టీ నుంచి టీడీపీకి వెళ్లిన ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ అంబటి సభలో వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు పోడియం వద్ద నిలబడగా, టీడీపీ సభ్యులు పోడియం పైన ఆందోళన నిర్వహించారు. టీడీపీ సభ్యుల పైన చర్యలు తీసువాలని మంత్రులు స్పీకర్ ను కోరారు. సభ్యులు వెనక్కు వెళ్లాలని చేతులు జోడించి స్పీకర్ కోరారు. దీంతో, సభా నిర్వహణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+