AP Capital: ఏపీ రాజధానిపై కేంద్రానిదే నిర్ణయం- మేం పిచ్చోళ్లమా ? బొత్స షాకింగ్ కామెంట్స్ !

ఏపీ రాజధాని వివాదం ఎన్నికల వేళ మరో మలుపు తిరుగుతోంది. గత ఎన్నికల సమయంలో అమరావతే రాజధానిగా ఉంటుందని, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నానంటూ చెప్పుకున్న జగన్.. గెలిచాక మాత్రం మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారు. దీంతో అమరావతి రైతుల రాజధాని ఉద్యమం మొదలైంది. దీంతో ఈ ప్రాంతంలో వైసీపీ పరిస్దితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని వైసీపీ తెరపైకి తెస్తోంది.

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో వైజాగ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకూ దాన్ని కొనసాగించాలని కేంద్రాన్ని కోరబోతున్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తాజాగా బాంబు పేల్చారు. ఇవాళ దానికి కొనసాగింపుగా రాజధానిపై కేంద్రమే నిర్ణయం తీసుకుటుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మరో సంచలన వ్యాఖ్య చేశారు. హైదరాబాద్ ఏపీ-తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా కొనసాగింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందంటూ బొత్స వ్యాఖ్యానించారు.

ysrcp minister botsa satyanarayana shocking comments on ap capital, says centre will decide..

విభజన చట్టంలో అంశాలపై మాత్రమే తాము కేంద్రంపై పోరాడతామంటూ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని అన్నారని, అది కాస్తా పూర్తయింది కాబట్టి కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైజాగ్ లో రాజధాని కడదామంటే అడుగడుగునా అడ్డుకుంటున్నారంటూ బొత్స విపక్షాలపై మండిపడ్డారు.

మరోవైపు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదని బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చేశారు. అలాగే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదని బొత్స తేల్చిచెప్పారు. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమవుతుందని అడిగారు. ఉమ్మడి రాజధాని అడగడానికి తామేమైనా పిచ్చోళ్లమా అని ప్రశ్నించారు. అనుభవం ఉన్న నేత ఎవరూ ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+