చంద్రబాబు టైంలో ఎయిడ్స్ లో ఫస్ట్-ఇప్పుడు అందులో ఫస్ట్- మంత్రి దాడిశెట్టి కామెంట్స్..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ లో భాగంగా మాటలయుద్ధం తీవ్రమవుతోంది. ఇదే క్రమంలో రాష్ట్రమంత్రి దాడిశెట్టి రాజా గత టీడీపీ ప్రభుత్వ పాలనను, ప్రస్తుత వైసీపీ పాలనతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తద్వారా జగన్ పాలన ఎంత మెరుగ్గా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు.

గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రం హెచ్ఐవీ ఎయిడ్స్ లో ప్రధమ స్థానంలో ఉండేదని వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం జబ్బుపడిపోయిందన్నారు. జగనన్న నాయకత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయం రాష్ట్రంలో పరుగులు పెడుతుందన్నారు. సీఎం జగనన్న ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని రాజా వెల్లడించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అర్హులను వెతికి వారికి పధకాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యమని గుర్తుచేశారు.

dadisetti raja

ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలు అందకుండా ఉండారా అన్నది తెలుసుకోవడమే జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. గత 40 ఏళ్లలో పాలించిన వారు ఎంతిచ్చారో, జగన్ పాలనలో ప్రజలకు ఎంత ఇచ్చారో సరిపోల్చి చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు గతంలో ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా చూడాలన్నారు. జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యావ్యవస్ధ దేశంలోనే మొదటి స్ధానంలో ఉందన్నారు.

dadisetti raja

గతంలో ఎల్లో మీడియా విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఓ విషయంలో మొదటిస్ధానంలో ఉండేదన్నారు. అది హెచ్ఐవీ ఎయిడ్స్ అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం జబ్బు పడిపోగా.. ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు పరుగుపెడుతుందన్నారు. గతంలో ఆస్పత్రులకూ, ఇప్పుడు ఆస్పత్రులకు కూడా తేడా గమనించాలని మంత్రి రాజా కోరారు. ప్రస్తుతం రోజుకు 25 -30 వేలు ప్రభుత్వ ఆస్పత్రులకు ఖర్చుపెడుతున్నామన్నారు. జనం ఈసారి 175 సీట్లు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+