సదావర్తి భూములు: హైకోర్టు ఆదేశాలతో రూ.27.44 కోట్లు చెల్లించిన ఎమ్మెల్యే ఆళ్ళ
సదావర్తి భూముల విషయంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూ.17.44 కోట్లను దేవాదాయశాఖకు చెల్లించారు.
హైదరాబాద్: సదావర్తి భూముల విషయంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూ.17.44 కోట్లను దేవాదాయశాఖకు చెల్లించారు. రెండు విడతల్లో ఈ భూమికి రూ. 27.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాకు జమచేశారు.
సదావర్తి భూముల వేలం వ్యవహరంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. దీంతో గతంలో చెల్లించిన మొత్తం కంటే అదనంగా రూ. 10 కోట్లు చెల్లిస్తే ఆ భూములను మీకే కేటాయిస్తామని హైకోర్టు చెప్పింది.

అయితే దీనికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి సానకూలంగా స్పందించారు. గతంలోనే రామకృష్ణారెడ్డి రూ. 10 కోట్లను చెల్లించారు. శుక్రవారం నాడు రూ.17.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాలో జమ చేశారు. ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కొందరు తమ అనుయాయులకు రూ.22 కోట్లకు ధారదత్తం చేసిందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన రూ.27.44 కోట్లను చెల్లించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications