Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకేష్ ..మీ తండ్రినే జైలుకు పంపిస్తా: ఎమ్మెల్యే ఆళ్ళ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ బెదిరింపులకు తాను భయపడబోనని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ బెదిరింపులకు తాను భయపడబోనని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. సదావర్తి భూముల వ్యవహరంలో కోర్టు తీర్పుకు లోబడి డబ్బు కడతామన్నారు. తాము డబ్బు కడితే ఐటీ దాడులు చేయిస్తామని మంత్రి లోకేష్ చెప్పినట్టు వచ్చిన వార్తలపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు.

Ysrcp MLa Alla Ramakrishna Reddy warnes to Ap minister Nara Lokesh

ఓటుకు నోటు కేసులో దొరికిన డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. దేవాలయ ఆస్తిని కాపాడేందుకు కుట్రలు చేస్తోంటే కోర్టుకు వెళ్ళి అడ్డుకొన్నానని చెప్పారు. సదావర్తి భూములకు డబ్బులు కడితే ఐటీ దాడులు చేయిస్తామని బెదిరించడం దారుణమన్నారు.

సదావర్తి భూములు స్వంతం చేసుకొన్న కాపు కార్పోరేషన్ ఛైర్మెన్ సంబంధీకులు రూ. 22 కోట్లు కట్టారు. మరీ రూ. 22 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి. వారి మీద ఐటి దాడులు చేయించారా? భ్రీఫ్డ్ మీ అని మీ నాన్న ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయారు.

ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చిందని అడిగితే మీ నాన్న నోరెత్తడం లేదు. కోర్టు తీర్పుకు లోబడి నడుచుకొనేందుకు ప్రయత్నిస్తోంటే లోకేష్ బెదిరింపులకు దిగారన్నారు. 2 ఎకరాల నుండి నీ తండ్రి 2 లక్షల కోట్లు ఎలా సంపాదించాడని ఆయన ప్రశ్నించాడు.

ఎన్నికల్లో 600 పై చిలుకు అబద్దపు హమీలిచ్చి అధికారంలోకి వచ్చారు. వాటి అమలుపై దృష్టిపెట్టాలని ఆయన హితవు పలికారు. ఓటుకు కోట్ల కేసులో మీ నాన్నను జైలుకు పంపిస్తా. వర్థంతి, జయంతికి తేడా తేలియని నువ్వా, నన్ను విమర్శించేది? అని ఆయన ప్రశ్నించారు.

తాటాకు చప్పుళ్ళకు తాను భయపడనని చెప్పారు. తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లోనే సమర్పించినట్టు చెప్పారు. ధైర్యముంటే మీ ఆస్తులు, నా ఆస్తులపై సిబిఐ విచారణ జరిపిస్తే ఎవరేంటో తెలిసిపోతోందన్నారు రామకృష్ణారెడ్డి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+