మంత్రి పదవిపై ఆనం హాట్ కామెంట్స్-రేసులో అయితే లేను-ఫోనొచ్చేదాకా తెలియదు
ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళనకు ముహుర్తం దగ్గరపడుతోంది. ఈ నెల 11న అమరావతిలోని సచివాలయం పక్కన ఉన్న ప్రాంతంలో మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టేందుకు సీఎం జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు రేపు గవర్నర్ కు కూడా సమాచారం అందించబోతున్నారు. అయితే ఇందులో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 11న జరిగే మంత్రివర్గ ప్రక్షాళనపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ స్పీకర్, మంత్రి పదవి రేసులో తాను లేనని ఆనం స్పష్టంచేశారు. దానికోసం ముఖ్యమంత్రి వద్ద చర్చ కూడా లేదన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందా ? రాదా ? అనేది ఊహాజనితమన్నారు. ఊహల్లో ఉండే రాజకీయాలు తాను చేయబోనన్నారు. మంత్రివర్గ ఏర్పాటు పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయమన్నారు. మంత్రి పదవులు ఎవరికీ అనేది, ముఖ్యమంత్రి వద్ద నుండి గవర్నర్ కు లిస్ట్ వెళ్లి, ఫోన్లు వచ్చేదాకా ఎవరికి తెలియదన్నారు.

మంత్రిపదవి రేసులో లేని తాను దాని గురించి తాపత్రయం పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే ఆనం స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాలు కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసమే తప్ప, తన స్వంత రాజకీయ భవిష్యత్ కి వాడుకోలేదని ఆనం వెల్లడించారు. భవిష్యత్తులోనూ వాడుకోనని తెలిపారు. నెల్లూరు జిల్లా నుంచి ప్రస్తుత కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరైన గౌతంరెడ్డి హఠాన్మరణం చెందారు. మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను సీఎం జగన్ ఎలాగో తప్పిస్తున్నారు. దీంతో ఈ జిల్లాలో సీనియర్ మాజీ మంత్రి కూడా అయిన ఆనంకు ఈసారి పదవి దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. అది కుదరకపోతే మాత్రం కనీసం స్పీకర్ అయినా ఇస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications