ఉద్యోగులపై మరోసారి రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి:ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు.పచ్చచొక్కాలు వేసుకొన్న కొందరు అధికారులను వదిలిపెట్టబోనని మరోసారి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు.

టీడీపీ నేతలు ఉద్యోగులపై దాడులు చేస్తోంటే , ఉద్యోగసంఘాల నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల్లో ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని , ఇవన్నీ ఉద్యోగ సంఘాలకు కనపడడం లేదా అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు.

chevireddy bhasker reddy

తప్పుచేసిన ఉద్యోగులకు చెబుతున్నవన్నీ ట్రైలర్ మాత్రమేనన్నారు.సినిమా ఇంకా దారుణంగా ఉంటుందని చెవిరెడ్డి చెప్పారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఉద్యోగులను ఉద్దేశించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీని టార్గెట్ చేసిన అధికారులను వెంటాడుతామన్నారు.

అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకొంటామని హెచ్చరించారు. చిత్తూరు వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న చెవిరెడ్డి, అధికారులను బట్టలూడదీసి కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. అధికారులు ఎంతటివారైనా వదలిపెట్టనన్నారు. చట్టసభల్లో కూర్చొనే నేతల్ని చిన్నచూపు చూసిన అధికారులు, ఉద్యోగులను అండమాన్ పంపించాలని చెవిరెడ్డి కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp MLA Chevireddy Bhaskar Reddy once again sensational comments on employees on Sunday. , I will punish employees who supporting Tdp he said.
Please Wait while comments are loading...