వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'టీడీపీకి దోచిపెట్టేందుకే', 'అమరావతిని రియల్ ఎస్టేట్ హబ్‌'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లో రూ. 6వేల కోట్లను తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దోపిడీ చేశారని వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకే ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనా వ్యయం పెంచారన్నారు.


దన్నం పెట్టి చెబుతున్నా, అడ్డంకులు సృష్టించొద్దు: చంద్రబాబు


దీనిని మంత్రివర్గం ద్వారా ఆమోదించడం దారుణమన్నారు. ఏపీలో బ్యాక్ స్క్రీన్‌లో చిన్న బాబు ఫ్రంట్ స్క్రీన్‌లో పెద్దబాబు దోచుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను ఉద్దేశించి మాట్లాడారు.

Ysrcp mla jyothula nehru fires on aap govt over irrigation projects

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత వ్యయం వెచ్చించారో దానిపై ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి: గొల్ల బాబూరావు

ఏపీలో జన్మభూమి కమిటీలకు రద్దు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లపై ఏర్పాటైన జస్టిస్ మంజునాథ కమిషన్‌తో కాలయాపన చేయకుండా, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.

కాపులను షెడ్యూల్ - 9లో చేర్చే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని రియల్ ఎస్టేట్ హబ్‌గా తయారు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.

English summary
Ysrcp mla jyothula nehru fires on aap govt over irrigation projects
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X