మగాళ్ళు ఎవరో.. మడతగాళ్ళు ఎవరో ప్రజలే నిర్ణయించారు; టీడీపీ, చంద్రబాబుపై కాసు మహేష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల పోరు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి కారణంగా మారుతుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఉనికి చాటుకోవాలని ప్రతిపక్షాలు, ఎన్నికలు జరిగే అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేయాలని అధికార పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో గురజాల, దాచేపల్లి నగర నగర పంచాయతీలలో అలాంటి ఫలితాలే రానున్నాయని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

యుద్ధాలు చేస్తాం, మీసాలు తిప్పుతాం అంటూ టీడీపీ చీప్ ట్రిక్స్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపిపై విరుచుకుపడిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసే చీప్ ట్రిక్స్ అంటూ మండిపడ్డారు. యుద్ధాలు చేస్తాం, మీసాలు తిప్పుతాం.. తొడలు చరుస్తామని చెప్పే మాటలన్నీ కేవలం ప్రచారం కోసం చెప్పే కబుర్లు అంటూ మండిపడ్డారు. గురజాల నియోజకవర్గంలో టిడిపి చెయ్యలేని అభివృద్ధి 30 నెలల్లోనే తాము చేసి చూపించామని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు.

2019లో మగాళ్ళు ఎవరో మడతగాళ్లు ఎవరో తేలింది
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సత్తా ఏమిటో చూపించామని పేర్కొన్న ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అప్పుడు ఎన్నికల్లో ప్రజలు మగాళ్ళు ఎవరో మడతగాళ్లు ఎవరో నిర్ణయించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో గురజాల, దాచేపల్లి లో ఏం చేశారో చెప్పాలని కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. దాచేపల్లి పట్టణంలో చంద్రబాబు డబ్బులు పంచితే, మద్యం పంచుతూ ఒకరిద్దరు టిడిపికి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చంద్రబాబు డబ్బులు పంపితే రేవంత్ రెడ్డి పట్టుబడలేదా? అదేమైనా ప్రతిపక్షాల కుట్రనా అంటూ ప్రశ్నించారు.

దమ్ము, ధైర్యం పుష్కలంగా ఉంది కాబట్టే ఎన్నికల్లో గెలిచాం
దాచేపల్లికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నిస్తే ఇంతవరకు చంద్రబాబు జవాబు చెప్పలేదని కాసు మహేష్ రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. దమ్ము, ధైర్యం గురించి టిడిపి నేతలు మాట్లాడుతున్నారని, దమ్ము, ధైర్యం పుష్కలంగా ఉండబట్టే కదా 2019లో పోరాటాలు చేసి మరీ గెలిచామని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలకు వెళ్లినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అంటే ప్రజల మనసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉందని అర్థం అంటూ కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి చంద్రబాబు తెచ్చిందే
ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతిని చంద్రబాబే తీసుకు వచ్చాడని, చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కృతి ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని దహించి వేస్తోందని ఆరోపించారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. దాచేపల్లి,గురజాలలను తామే పట్టుబట్టి నగర పంచాయతీలుగా మార్చామని, అభివృద్ధి కూడా వైసీపీనే చేసి తీరుతుందని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనలో ఉన్నతమైన పట్టణాలుగా వీటిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులకు వెళ్లి ఎన్నికలను ఆపాలని చూశారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అంటూ కాసు మహేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications