వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యేలతో నిరంకుశంగా చంద్రబాబు!; 'దయ్యాలకు ఫించన్లు'

సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి అడిగితే.. నిరంకుశంగా స్పంద

|
Google Oneindia TeluguNews

విజయవాడ : ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబు అపాయింట్ మెంట్ సంపాదించిన ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీలో పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి ఈ భేటీలో ఎమ్మెల్యేలు చర్చించారు.

భేటీ అనంతరం పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాల‌ని సీఎంను కోరామని, అయితే ఆయన్నుంచి నిరంకుశ స్పందనే వచ్చిందని పెదవి విరిచారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను సీఎంకు లిఖిత పూర్వ‌క లేఖను సీఎంకు అందజేశామని, సమస్యల పరిష్కారంలో ఆయనకు సానుకూల ఆలోచన లేనట్టుగానే కనిపిస్తోందని ఆరోపించారు.

భేటీ ఆసాంతం నిరాశజనకంగా సాగిందని, చంద్రబాబు స్పందన నిరంకుశంగా ఉందని పెద్దిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Chandrababu

కాంగ్రెస్ హయాంలో దయ్యాలకు కూడా ఫించన్లు: చంద్రబాబు

రాష్ట్రంలో చేపడుతున్న ఫించన్ల పంపిణీలో ఎక్కడా అవినీతికి తావులేకుండా వ్యవహరిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత కాంగ్రెస్ హయాంలో దయ్యాలు కూడా ఫించన్లు తీసుకున్నాయని ఈ సందర్బంగా ఆయన ఆరోపించారు.

ఉన్నత కుటుంబాలకు చెందినవారు కూడా కాంగ్రెస్ హయంలో ఫించన్లు అందుకున్నారని, ఒకే ఇంట్లో ఐదారుగురు ఫించన్లు అందుకున్న దాఖాలాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. దయ్యాల పేరుతో ఫించన్లు తీసుకున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
After the meet with CM Chandrababu Naidu YSRCP MLA Peddireddy Ramachandra Reddy talked to media. He expressed unhappy about meeting with chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X