Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అది టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ యాత్ర; బాబు డైరెక్షన్, లోకేష్ ప్రొడ్యూసర్ .. ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అమరావతి రైతుల ఉద్యమంలో భాగంగా ప్రస్తుతం ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి, వివిధ జిల్లాల ప్రజల మద్దతు కూడగట్టడం కోసం న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టి గత 15 రోజులుగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు ఎదురవుతున్నా, అనేక ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ పాదయాత్రను సాగిస్తున్నారు.

రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రకు కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రకు కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే


ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రైతులపై ఇటీవల లాఠీచార్జి చేసిన ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమరావతి పాదయాత్ర రైతులు చేస్తున్న పాదయాత్ర కాదని టిడిపి పాదయాత్ర అని వైసిపి నాయకులు టార్గెట్ చేస్తున్నారు.న్యాయస్థానం టు న్యాయస్థానం కాకుండా, మోసం టూ మోసం అన్యాయం టూ అన్యాయం అని పేరు పెట్టుకోవాలని వైసీపీ మంత్రి జయరామ్ సూచించారు. రైతుల సాగిస్తున్న పాదయాత్రకు దర్శకుడు, నిర్మాత చంద్రబాబేనని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక తాజాగా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఆయన కొత్త పేరు పెట్టారు.

టీడీపీ నేతలు చేస్తున్న రియల్ ఎస్టేట్ యాత్ర అంటూ రైతుల పాదయాత్రపై ఆగ్రహం

టీడీపీ నేతలు చేస్తున్న రియల్ ఎస్టేట్ యాత్ర అంటూ రైతుల పాదయాత్రపై ఆగ్రహం

విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అమరావతి రైతుల పాదయాత్ర పాదయాత్ర కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న రియల్ఎస్టేట్ యాత్ర అని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు స్టేట్ గురించి ఆలోచించకుండా రియల్ ఎస్టేట్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అంటూ నిప్పులు చెరిగారు. శివరామన్ కమిటీ, శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారమే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకు వచ్చారని పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. అమరావతి రైతులు చేస్తున్నది న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కాదని అన్యాయం టూ అన్యాయం, దౌర్జన్యం టూ దౌర్జన్యం పాదయాత్ర అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు రాజన్నదొర.

పాదయాత్రకు బాబు డైరెక్షన్, లోకేష్ ప్రొడ్యూసర్, మాటలు, పాటలు పట్టాభి

పాదయాత్రకు బాబు డైరెక్షన్, లోకేష్ ప్రొడ్యూసర్, మాటలు, పాటలు పట్టాభి

ఇక ఇదే సమయంలో చంద్రబాబు ని టార్గెట్ చేసిన పీడిక రాజన్నదొర రైతుల సాగిస్తున్న పాదయాత్రకు డైరెక్షన్ చంద్రబాబునాయుడు చేస్తున్నారని, ఇక ప్రొడ్యూసర్ గా, మాటలు, పాటలు లోకేష్, పట్టాభి అందిస్తున్నారని, సంగీత దర్శకత్వ బాధ్యతలు తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అమరావతి రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర నాయకులు వెళ్లి ముష్టి అడుక్కోవాలా ప్రశ్నించారు. రాజధాని రాకుండా అడ్డుకుంటున్న ఉత్తరాంధ్ర టిడిపి నాయకులను విద్యార్థి సంఘాలు, యువత నిలదీయాలని పీడిక రాజన్నదొర సూచించారు.

రాజధాని అమరావతిపై మారని వైసీపీ నేతల తీరు

రాజధాని అమరావతిపై మారని వైసీపీ నేతల తీరు


ఒకపక్క రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని రాజధాని అమరావతి ప్రాంత రైతులు పోరాటం చేస్తుంటే వైసీపీ అమరావతి రైతుల పాదయాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని తేల్చి చెప్తుంది. వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ రాజధాని రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నా వైసీపీ మాత్రం ససేమిరా అంటుంది. ఇప్పటికే రాజధాని రైతుల పోరాటాన్ని పెయిడ్ ఆర్టిస్టుల పోరాటంగా, శ్రీమంతుల పోరాటంగా, చంద్రబాబు బినామీలు చేస్తున్న పోరాటంగా పేర్కొంటూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. మరోవైపు మూడు రాజ్దానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర మహా పాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్న స్వచ్చంద సంస్థలకు మద్దతు ప్రకటించి మూడు రాజధానుల నినాదాన్ని, వైజాగ్ రాజధాని చెయ్యాలనే బలమైన ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+