పవన్ మెంటలోడు- బాబూ, బీజేపీని నమ్మే పరిస్ధితి లేదు-వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కామెంట్స్..

ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న వార్ లో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు సాగిస్తున్న యాత్రలు, చేస్తున్న విమర్శలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇవాళ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పవన్ ను టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేశారు.

రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన తప్ప అందరూ జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. పవన్ మెంటలోడని ఆయన వ్యాఖ్యానించారు. పిచ్చిపట్టిపోయి ఉన్నాడన్నారు. ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తాడో తెలియదని, జగన్ ను, ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప మరొకటి తెలీదన్నారు.రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడని, ఓపికనేదే లేదు రాజకీయాలు తెలీదంటూ పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

prasannakumar

అలాగే చంద్రబాబు ఎన్టీఆర్ కు ఎలా వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడో అందరికీ తెలుసని ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు.చంద్రబాబు ఆయన కొడుకును ఓవైపు, పవన్ ను మరోవైపు తిరుగతూ జగన్ ను ప్రజల్లో దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆక్షేపించారు. ప్రజలు చంద్రబాబు, బీజేపీ, పవన్ ను నమ్మే పరిస్దితుల్లో లేరన్నారు. ఏ సీఎం చేయని విధంగా నాలుగేళ్లలో రెండు లక్షల కోట్లిచ్చాం, మతాలు, కులాలు, పార్టీలు చూడలేదన్నారు.

రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు కూడా జగన్ ను అభినందిస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలో బటన్ నొక్కితో అందరికీ లబ్ది కలుగుతోందన్నారు. అందుకే పవన్, టీడీపీ నేతలు జనంలోకి వచ్చి విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+