చంద్రబాబు నుండి పవన్ కళ్యాణ్క్ డబ్బులు: వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవసరమైనప్పుడు , ఆయన నుండి డబ్బులు చేతికందగానే జసనేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డుపైకి వస్తారని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

కడపలో సోమవారం నిర్వహించిన వైసీపీ జిల్లా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. జనసేన చీఫ్ పనన్ కళ్యాణ్ చంద్రబాబునాయుడు చెప్పినట్టు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.

Ysrcp Mla Ravindranath Reddy allegations on pawan kakalyan

చంద్రబాబు నుండి డబ్బులు చేతికి అందగానే పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్ ప్రారంభిస్తారని చెప్పారు. షెడ్యూల్ కు షెడ్యూల్ కు మధ్య డబ్బు ముట్టజెప్పితేనే ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు.

పవన్ కళ్యాణ్ డబ్బు రాజకీయం చేస్తూ చంద్రబాబునాయుడు చెప్పినట్టు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవ్ ప్రజారాజ్యం పెట్టి 18 స్థానాలు గెలిచి అనంతరం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపారని ఆయన గుర్తుచేశారు.

పవన్ కళ్యాణ్ షెడ్యూల్ షెడ్యూల్ రాజకీయానికి డబ్బు తీసుకొంటూ కొత్త కోణంలో పయనిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp Mla Ravindranath Reddy allegations on Janasena chief Pawan Kalyan on Monday.he participated in Kadapa ysrcp plenary.
Please Wait while comments are loading...