వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిచ్చెక్కి బాబునే తిట్టాడు, ఇక్కడి పందులు వైయస్‌వి కావు!: రోజా

కాకినాడలో పందుల బెడదకు నాడు పరిపాలించిన వైయస్ రాజశేఖర రెడ్డే కారణమని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.దీనిపై రోజా ఆదివారం ఓ న్యూస్ ఛానల్‌తో స్పందించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: కాకినాడలో పందుల బెడదకు, అపరిశుభ్ర వాతావరణానికి నాడు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డే కారణమని టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేయడం సరికాదని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు.

ఇక గంటల్లో వైసిపి క్లోజ్: ఆది హెచ్చరిక, 'రోజా వచ్చిందంటే, జగన్ నోటి దురుసుపై ప్రచారం'ఇక గంటల్లో వైసిపి క్లోజ్: ఆది హెచ్చరిక, 'రోజా వచ్చిందంటే, జగన్ నోటి దురుసుపై ప్రచారం'

కాకినాడ ప్రచారంలో గోరంట్ల మాట్లాడారు. పందుల బెడదకు, అపరిశుభ్ర వాతావరణానికి వైయస్ కారణమన్నారు. దీనిపై రోజా ఆదివారం ఓ న్యూస్ ఛానల్‌తో స్పందించారు.

గోరంట్ల చంద్రబాబునే తిట్టారు

గోరంట్ల చంద్రబాబునే తిట్టారు

బుచ్చయ్య చౌదరి అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని రోజు మండిపడ్డారు. వైసిపి నుంచి టిడిపిలోకి తీసుకున్న నేతలకు మంత్రి పదవి ఇచ్చి, ఆయనకు పదవి ఇవ్వలేదని బుర్ర పిచ్చెక్కిపోయి చంద్రబాబు నాయుడినే తిట్టాడని, ఎప్పుడేమి మాట్లాడతాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.

Recommended Video

YS Jagan Warns MLA Roja | Oneindia Telugu
రోజా తీవ్ర వ్యాఖ్యలు

రోజా తీవ్ర వ్యాఖ్యలు

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వేసిన రోడ్లు, డ్రైనేజ్‌లు, కట్టించిన ఇళ్లు తప్పా ఇక్కడ కొత్తగా ఏమీ లేవని రోజా అన్నారు. పందుల వయసు ఎంతో కూడా తెలియని బుచ్చయ్య చౌదరి, గుంపులు గుంపులుగా పందుల్లా వచ్చేసి మంత్రులు డబ్బులు పంచేసి ఇక్కడ ఎన్నికలు గెలవాలని అనుకుంటున్నారని ఆరోపించారు.

ఇక్కడ పెంచే పందులు వైయస్‌వి కాదు

ఇక్కడ పెంచే పందులు వైయస్‌వి కాదు

ఇక్కడ పెంచే పందులు రాజశేఖర రెడ్డివి కాదని, ఆయన చనిపోయింది 2009లోనే అని, ఇప్పుడు 2017 అని రోజా గుర్తు చేశారు. టిడిపి వాళ్లకు పిచ్చి ఎంతగా ముదిరిందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

రోజా

రోజా

ఇక, కాకినాడ ఎన్నికల ప్రచారంలో రోజా మాట్లాడుతూ.. బుద్ధిలేని కుమారుడు లోకేష్‌కు మంత్రి పదవి ఇప్పించుకున్న చంద్రబాబు, లక్షలాది యువతలో ఏ ఒక్కరికి ఉద్యోగం ఇప్పించలేకపోయారని దుయ్యబట్టారు. ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వారే కాకినాడ ఓటర్లు అనే తరహాలో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు.

English summary
YSR Congress Party MLA Roja campaign in Kakinada municipal corporation elections on Sunday. She lashed out at Telugu Desam Party leader Gorantla Buchaiah Chwdary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X