మార్చి 9న తీర్పు: సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టుకు ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్: తనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజా సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. తన సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్ధమంటూ ఆమె సుప్రీం కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
మార్చి 5 నుంచి ఆంధ్రప్రదేశ్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ సస్పెన్షన్ కారణంగా ఎమ్మెల్యే రోజాను అనుమతించడం లేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమెపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై రోజూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుని ఆశ్రయించారు.
దీంతో ఆమెకు హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఎదుట చుక్కెదురైంది. తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. దాంతో రోజా సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. అయితే పిటిషన్‌ను స్వీకరించిన సింగిల్ బెంచ్ ఈ నెల 8వ తేదీన వాదనలు వింటామని చెప్పింది.

దీంతో వాదనలు విన్న సింగిల్ బెంచ్ హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శిని కౌంటర్ పిటిషన్‌కు ఆదేశించింది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీతో సమావేశమై, హైకోర్టుకు నివేదిక అందించారు. దీనిపై బుధవారం కేసు తీర్పు వెల్లడి కానుంది. తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ మంగళవారం రోజా సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.
హైకోర్టులో రోజా తరుపున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అంతకముందు వాదనలు వినిపించారు. రోజా సస్పెన్షన్‌పై దాఖలైన వ్యాజ్యంలో శాసన వ్యవహారాల శాఖ, అసెంబ్లీ కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయకుండా వాయిదా కోరిన సంగతి తెలిసిందే.
దానిపై అదనపు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల 17న ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి 24న అందాయని, వాదనలు చెప్పాలని తనను కోరారని, ఆ విషయాన్నే కోర్టుకు చెప్పి వాయిదా కోరానని తెలిపారు. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 194(3) ప్రకారం సభా మర్యాదలు పాటించని సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేయవచ్చని చెప్పారు.












Click it and Unblock the Notifications