టీడీపీలో మగాళ్లు లేరు: చంద్రబాబు రాయలసీమ బిడ్డైతే అంటూ రోజా సవాల్

హైదరాబాద్: విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. విశాఖపట్టణంలో రైల్వే జోన్ విశాఖ హక్కు అంటూ గుడివాడ అమర్నాధ్‌ చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే రోజా, ఎంపీ వరప్రసాద్ సంఘీభావాన్ని తెలిపారు.

అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. ఉత్తరాంధ్ర మంత్రులకు రైల్వే జోన్ పట్టదా? అని ప్రశ్నించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు పోటీ పడి దోచుకుంటున్నారని అన్నారు.

టీడీపీలో మగాళ్లు లేక వైసీపీకి చెందిన చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొని తీసుకెళ్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే, ఆయనే కనక రాయలసీమ బిడ్డ అయితే తక్షణం వారందర్నీ పదవులకు రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.

Ysrcp mla Roja fires on chandrababu naidu over visakhapatnam railway zone

టీడీపీ ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలంభిస్తూ పాలన సాగిస్తోందని ఆమె మండిపడ్డారు. 15 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా విశాఖకు రైల్వే జోన్ తీసుకురావడంతో విఫలమయ్యారని విమర్శించారు. అందుకే మేం పోరాడాల్సి వస్తుందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు నిధుల కింద చంద్రబాబు నాయుడు పది వేల కోట్లు అడిగితే కేంద్రం కేవలం రూ. 700 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కుంభకోణం బయటకు తీస్తారనే భయంతో చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని ఆమె విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్ ను తాకట్టుపెడుతున్నారని ఆమె విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+