సూపర్ స్టార్ మహేష్ బాబుకు రోజా హ్యాట్సాఫ్: గుండె చప్పుడుగా
అమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రారంభించిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్.. అందరి ప్రశంసలను అందుకుంటోంది. హృద్రోగాలతో బాధపడే చిన్నారుల కోసం రెయిన్‌బో ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి ఆయన ఈ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ కింద చేపట్టే చిన్నపిల్లల గుండె ఆపరేషన్, నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని మహేష్ బాబు అందిస్తారు. బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో మహేష్ బాబు తన ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు.
ఫౌండేషన్ కింద ఆపరేషన్ చేయించుకున్న చిన్నపిల్లలతో మాట్లాడారు. వారికి, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో ఈ ఫౌండేషన్ పనితీరు, నిర్వహణ గురించి వివరించారు. రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి తన ఫౌండేషన్ పనిచేస్తుందని పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధుల బారిన బడిన ఎంతో మంది చిన్నారులకు తమ ఫౌండేషన్ ద్వారా సహకారం అందించామని అన్నారు. భవిష్యత్తుల్లో ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగిస్తామని మహేష్ బాబు చెప్పారు.

ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించడం పట్ల మహేష్ బాబు అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఆయనను రియల్ హీరోగా అభివర్ణిస్తోన్నారు. ఏ హీరో కూడా చేయలేని సాహసం చేశారని ప్రశంసిస్తోన్నారు. ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌ను స్థాపించడానికి ముందు నుచే తమ ఆరాధ్య హీరో.. ఎందరో నిరుపేద చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారని గుర్తు చేస్తోన్నారు. వెయ్యిమందికి పైగా పిల్లలకు ఆయన ప్రాణదానం చేశారని ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు.
❤️చిన్నారుల గుండె చప్పుడు వింటున్న @urstrulyMahesh హ్యాట్సాఫ్. 🙏🙏🙏 pic.twitter.com/OwXtyz33GD
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 6, 2022
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఆర్కే రోజా కూడా మహేష్ బాబును ప్రశంసించకుండా ఉండలేకపోయారు. రెయిన్ బో చిల్డ్రన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేష్ బాబు మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను ఆమె తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. చిన్నారుల గుండె చప్పుడు వింటోన్న మహేష్ బాబుకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్‌ను దానికి యాడ్ చేశారు.












Click it and Unblock the Notifications