టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత-పోటీపై కీలక వ్యాఖ్యలు..!

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇవాళ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా ఈసారి తనకు టికెట్ దక్కకపోవడంతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు నియోజకవర్గంలో తన అనుచరులు, పార్టీ క్యాడర్ తో భేటీ అయి చర్చలు జరిపిన వసంత.. టీడీపీలో చేరాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ వెళ్లి చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు.

ysrcp mla vasantha krishna prasad joined tdp left contest decision to chandrababu

వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే చంద్రబాబుతో ఫోన్ లో చర్చలు జరిపిన వసంత.. ఇవాళ హైదరాబాద్ వెళ్లి చంద్రబాబు నివాసంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపైనా, వచ్చే ఎన్నికల్లో తన పోటీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తనకు ఎలాంటి గౌరవం దక్కలేదని వసంత కృష్ణప్రసాద్ వాపోయారు.

చంద్రబాబు మరోసారి సీఎం కావాలన్నదే తన కోరికని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. అలాగే మైలవరంలో మరోసారి తాను పోటీ చేయడంపై స్పందిస్తూ.. చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తానన్నారు.లేదంటే పార్టీ కోసం పనిచేస్తానని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి పథంలో సాగాలంటే చంద్రబాబే సీఎం కావాలని వసంత ఆకాంక్షించారు. చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే మైలవరం అసెంబ్లీ టికెట్ పై వసంత కృష్ణప్రసాద్ కు హామీ లభించింది. ఈ మధ్యే చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన వసంతకు మైలవరంలో పనిచేసుకోవాలని సూచించారు. దీంతో వసంత స్ధానికంగా పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అలాగే మైలవరం టికెట్ ఆశించిన దేవినేని ఉమకు మైలవరం టికెట్ లేదని కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చేయడంతో వసంతకు లైన్ క్లియర్ అయినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+