Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్రాస్ ఓటింగ్‌ చేసినట్లు వార్తలు వస్తోన్న వేళ- ఉండవల్లి శ్రీదేవి కీలక వ్యాఖ్యలు..!!

అమరావతి: ఏపీలో శాసన మండలి (MLC elections in AP) ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మరో ఓటమిని చవి చూసింది. పట్టభద్ర నియోజకవర్గాల్లో ఎదురైన ఫలితాలే ఇక్కడా కనిపించాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలి వీచింది. సాంకేతికపరంగా తెలుగుదేశం పార్టీకి బలం లేనప్పటికీ- తన అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టమైంది.

వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన నెల్లూరు రూరల్, తిరుపతి జిల్లా వెంకటగిరి శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) కాకుండా మరో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. మొత్తంగా నలుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. ఫలితంగా- పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) విజయం సాధించారు.

ఓట్లు ఇలా..

వైఎస్ఆర్సీపీకి చెందిన మర్రి రాజశేఖర్- 22, పెన్మత్స సూర్యనారాయణ రాజు- 22, బొమ్మి ఇజ్రాయిల్- 22, పోతుల సునీత 22, ఏసురత్నం- 22 ఓట్లు పోల్ అయ్యాయి. పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు పడ్డాయి. జయమంగళ వెంకట రమణ- 21, కోలా గురువులు- 21 ఓట్ల పడ్డాయి. ప్రాధాన్యత క్రమంలో జయమంగళ వెంకటరమణ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. కోలా గురువులు ఓడిపోయారు.

ఆ ఇద్దరేనా?

పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు తాజాగా ఎదురైన ఓటమి- రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిణామాలను సృష్టించినట్టే కనిపిస్తోంది. కాగా- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన వైసీపీ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi), కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ (Burra Madhusudhan Yadav) క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉండొచ్చంటూ వార్తలొచ్చాయి.

YSRCPs MLA Vundavalli Sridevi condemn the allegations over cross voting in MLC elections in AP

తోసిపుచ్చిన శ్రీదేవి..

ఈ వార్తలపై ఉండవల్లి శ్రీదేవి, బుర్రా మధుసూదన్ యాదవ్ స్పందించారు. తాము క్రాస్ ఓటింగ్ కు చేయలేదని తేల్చి చెప్పారు. తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ రహస్య ఓటింగ్‌ పద్ధితిలో జరిగిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు తన పేరు ఎలా చెబుతారంటూ ఆమె నిలదీశారు. ఉదయమే తాను కుమార్తెతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశానని, తనకు ఇచ్చిన కోడ్‌ ప్రకారమే ఓటు వేశానని అన్నారు.

దళిత మహిళను కాబట్టే..

క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళను కాబట్టే చులకనగా, చిన్నచూపు చూస్తోన్నారని చెప్పారు. వైఎస్ జగన్ తనను ఆదరించి టికెట్ ఇచ్చారని, అలాంటప్పుడు ఆయనకు గానీ, పార్టీకి గానీ ద్రోహం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా తనపై వస్తోన్న వార్తలను తోసిపుచ్చారు. ఎవరో ప్రలోభ పెడితే.. దానికి లొంగిపోవాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+