చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చిన వైసిపి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి::ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విపక్ష వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులను మంగళవారం నాడు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అందజేశారు.

అసెంబ్లీ నిబంధన 168 కింద వైసిపి ఎమ్మెల్యేలు ఈ నోటీసులను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అందజేశారు. సోమవారంనాడు వైసిపి సభ్యులను ఉద్దేశించి ఎపి సిఎం చంద్రబాబునాయుడు అలగా జనం అంటూ చేసిన వ్యాఖ్యలపై వైసిపి ఈ నోటీసును ఇచ్చింది.

ysrcp mlas issued privilege notice to chandra babu naidu

తమను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉందని ఈ నోటీసులను ఇచ్చింది వైసిపి.ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నందుకు తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రికి అనుచితమని వైసిపి అభిప్రాయపడింది.

సభా హక్కుల ఉల్లంఘన కిందకు వైసిపి ఎమ్మెల్యేలు తమ నోటీసులో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మాణంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ysrcp mlas issued privilege notice to andhra pradesh chief minister chandrababu naidu on tuesday.
Please Wait while comments are loading...