వైయస్ ఫోటో తొలగింపు వివాదం: వర్షాకాల సమావేశాలకల్లా పెట్టకపోతే పోరాటమే (ఫోటోలు)
హైదరాబాద్: అసెంబ్లీ లాంచ్ నుంచి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో తొలగింపు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైయస్‌ఆర్ ఫోటోను యథాస్ధానంలో ఉంచాలని అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ధర్నా చేసి, స్పీకర్ కోడెలకు వినతిపత్రం సమర్పించారు.
తనకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెసా పార్టీ ఎమ్మెల్యేలతో స్పీకర్ కోడెల కొద్దిసేపు చర్చించారు. భవనం ఆధునీకరణలో భాగంగానే వైయస్ఆర్ ఫోటోతో పాటు మరో ముగ్గురు మహానీయలు ఫోటోలను తొలగించాల్సి వచ్చిందని వారికి వివరించారు.
ఆయన సమాధానంతో సంతృప్తి చెందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గదిలో కాసేపు బైఠాయించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోను ఎప్పుడు ఏర్పాటు చేస్తారో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై
వైయస్ఆర్ ఫోటో ఏర్పాటుపై స్పీకర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.
వైయస్ఆర్ ఫోటో ఏర్పాటు అంశాన్ని జనరల్ పర్పస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి వారితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోగా ఫోటో పెట్టకపోతే పోరాటం తప్పదని, స్పీకర్ కోడెలకు వినతిపత్రం సమర్పించారు.
స్పీకర్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాజకీయ కక్షతోనే వైయస్ ఫోటోను అసెంబ్లీ లాంజ్ నుంచి తీసివేశారని ఆరోపించారు. తిరిగి వైయస్ ఫోటోను యథాస్ధానంలో పెట్టేదాకా తమ పోరాటం కొనసాగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.
అసలు కారణం ఇదీ?
ఏపీ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైయస్ ఫోటో ఉన్న లాంజ్ ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలుమార్లు టిడిపి శాసన సభా పక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశం సమయంలో వైయస్ చిత్రపటానికి ముసుగు వేసేవారు.
వైయస్ మృతి చెందినప్పుడు దీనిని అక్కడ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో మాజీ సభాపతుల చిత్రపటాలు తప్ప, ముఖ్యమంత్రులవి ఏర్పాటు చేసే సంప్రదాయం లేకపోవడం వల్లనే వైయస్ చిత్రపటాన్ని తొలగించినట్లు శాసన సభ వర్గాలు చెబుతున్నాయి.

వర్షాకాల సమావేశాలకల్లా వైయస్ ఫోటో పెట్టకపోతే పోరాటమే
అసెంబ్లీ లాంచ్ నుంచి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో తొలగింపు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. వైయస్‌ఆర్ ఫోటోను యథాస్ధానంలో ఉంచాలని అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ధర్నా చేసి, స్పీకర్ కోడెలకు వినతిపత్రం సమర్పించారు.

వర్షాకాల సమావేశాలకల్లా వైయస్ ఫోటో పెట్టకపోతే పోరాటమే
తనకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెసా పార్టీ ఎమ్మెల్యేలతో స్పీకర్ కోడెల కొద్దిసేపు చర్చించారు. భవనం ఆధునీకరణలో భాగంగానే వైయస్ఆర్ ఫోటోతో పాటు మరో ముగ్గురు మహానీయలు ఫోటోలను తొలగించాల్సి వచ్చిందని వారికి వివరించారు.

వర్షాకాల సమావేశాలకల్లా వైయస్ ఫోటో పెట్టకపోతే పోరాటమే
ఆయన సమాధానంతో సంతృప్తి చెందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గదిలో కాసేపు బైఠాయించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోను ఎప్పుడు ఏర్పాటు చేస్తారో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై
వైయస్ఆర్ ఫోటో ఏర్పాటుపై స్పీకర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.

వర్షాకాల సమావేశాలకల్లా వైయస్ ఫోటో పెట్టకపోతే పోరాటమే
వైయస్ఆర్ ఫోటో ఏర్పాటు అంశాన్ని జనరల్ పర్పస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి వారితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోగా ఫోటో పెట్టకపోతే పోరాటం తప్పదని, స్పీకర్ కోడెలకు వినతిపత్రం సమర్పించారు.

వర్షాకాల సమావేశాలకల్లా వైయస్ ఫోటో పెట్టకపోతే పోరాటమే
స్పీకర్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాజకీయ కక్షతోనే వైయస్ ఫోటోను అసెంబ్లీ లాంజ్ నుంచి తీసివేశారని ఆరోపించారు. తిరిగి వైయస్ ఫోటోను యథాస్ధానంలో పెట్టేదాకా తమ పోరాటం కొనసాగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.

వర్షాకాల సమావేశాలకల్లా వైయస్ ఫోటో పెట్టకపోతే పోరాటమే
ఏపీ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైయస్ ఫోటో ఉన్న లాంజ్ ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలుమార్లు టిడిపి శాసన సభా పక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశం సమయంలో వైయస్ చిత్రపటానికి ముసుగు వేసేవారు.

వర్షాకాల సమావేశాలకల్లా వైయస్ ఫోటో పెట్టకపోతే పోరాటమే
వైయస్ మృతి చెందినప్పుడు దీనిని అక్కడ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో మాజీ సభాపతుల చిత్రపటాలు తప్ప, ముఖ్యమంత్రులవి ఏర్పాటు చేసే సంప్రదాయం లేకపోవడం వల్లనే వైయస్ చిత్రపటాన్ని తొలగించినట్లు శాసన సభ వర్గాలు చెబుతున్నాయి.

Click it and Unblock the Notifications