వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి-ఫారెస్ట్ ఆఫీసర్ తో జయమంగళ వెంకటరమణ వివాహం..
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఇవాళ మూడో వివాహం చేసుకున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన సుజాతను ఆయన మూడో పెళ్లి చేసుకున్నారు. గతంలో రెండుసార్లు పెళ్లి చేసుకున్న ఆయన.. ఆ బంధాలు నిలవకపోవడంతో చివరిగా ఇవాళ మరో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కైకలూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. ఆయనకు సమీప బంధువులు, నేతలు మాత్రం హాజరైనట్లు సమాచారం.
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణకు గతంలో ఓసారి వివాహం అయ్యాక భార్య చనిపోయారు. ఆ తర్వాత సునీత అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిన పెళ్లిలో అధికారికంగా వీరిద్దరూ ఒక్కటయ్యారు. దీంతో ఆయన మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లయింది.

గతంలో కైకలూరు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన జయమంగళ వెంకటరమణ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీ ఆయనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకుంది. దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి కైకలూరు నుంచి అవకాశం లభిస్తే పోటీ చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications