Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్‌సభ స్పీకర్‌కు మరోసారి లేఖ రాసిన వైసీపీ ఎంపీ రఘురామ: డిఫరెంట్ ఇష్యూతో: ఆయన దేవుడు

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మరోసారి లేఖ రాశారు. సొంత పార్టీపై తిరుగుబాటు జెండాను లేవనెత్తి రెబెల్ ఎంపీగా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం అనర్హత పిటీషన్‌ను ఎదుర్కొంటున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి నేత‌ృత్వంలోని ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు అందజేసిన మరుసటి రోజే ఆయన ఆయన ఓం బిర్లాకు లేఖ రాశారు.

చంద్రబాబు అమరావతి ఉద్యమం స్పాన్సర్డ్‌, ఈవెంట్ మేనేజ్మెంట్.. వైసీపీ సెటైర్లు- ఎందుకంత మోజంటూ..

అల్లూరి సీతారామరాజును

అల్లూరి సీతారామరాజును

రాజకీయ కారణాలతో ముడిపడి ఉన్న లేఖ కాదది. స్వాతంత్య్ర సమర యోధుడు, మన్యసీమ పోరాటవీరుడు అల్లూరి సీతారామరాజును జాతీయ నేతగా గుర్తించాలని కోరుతూ రాసిన లేఖ అది. అల్లూరి సీతారామరాజు 122వ జయంతిని పురస్కరించుకుని రఘురామ కృష్ణంరాజు ఈ లేఖ రాశారు. దేశ ప్రజస్వామ్య వ్యవస్థకు నిలువెత్తు ప్రతిబింబంగా నిలిచిన పార్లమెంట్ ఆవరణలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్‌కు విజ్ఙప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అకాంక్షలను నెరవేర్చాలని కోరారు.

అల్లూరిని మన్యం వీరుడిగా..

అల్లూరిని మన్యం వీరుడిగా..

అల్లూరి సీతారామరాజును మన్యం వీరుడిగా కొనియాడారు రఘురామ. 27 సంవత్సరాల వయస్సులోనే దేశం కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చారని కీర్తించారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని చెప్పారు. గిరిజనులు, ఆదివాసీల కోసం రక్తం ధారపోశారని అన్నారు. ఏపీ సహా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో నివసించే గిరిజనులు అల్లూరి సీతారామరాజును దేవుడిగా కొలుస్తారని చెప్పారు. మూడు రాష్ట్రాల ఏజెన్సీ ప్రజలు అల్లూరిని పూజిస్తారని అన్నారు.

తెలుగువారి స్వప్నం

తెలుగువారి స్వప్నం

పార్లమెంట్ ఆవరణలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనేది ఏపీ, తెలంగాణకు చెందిన వారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తోన్న 15 కోట్ల మంది తెలుగు ప్రజల చిరకాల స్వప్నం అని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే అల్లూరి కాంస్య విగ్రహం నమూనా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. లోక్‌సభ విగ్రహాల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం నమూనాను రూపొందించామని చెప్పారు. అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను అనుమతి ఇవ్వడమే ఆలస్యమని అన్నారు.

Recommended Video

    Priyanka Gandhi Set To Shift to Lucknow || Oneindia Telugu
    పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పేరు

    పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి పేరు

    పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టాలని ఇదివరకే రఘురామ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలంటూ ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఆయనకు లేఖ రాశారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ఈ మేరకు హామీ కూడా ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని కోరారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+