బీజేపీకి మద్దతు బహిరంగమే-హోదా ఇస్తానంటే కేంద్రంలోకి-వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బీజేపీతో స్నేహం పెరిగింది. ముఖ్యంగా రాష్ట్ర అవసరాల కోసం కేంద్రం మెడలు వంచుతానంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఆ తర్వాత మాత్రం ఎన్డీయేకు ప్రజలు మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఏమీ చేయలేం, మరో అవకాశం కోసం ఎదురుచూడాల్సిందే, అప్పటివరకూ ప్రయత్నాలు చేయాల్సిందేనని చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో కేంద్రానికి అన్నివిధాలా మద్దతిచ్చి రాష్ట్రానికి నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోవైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

కోటగిరి శ్రీధర్ వ్యాఖ్యలు
వైసీపీలో అత్యంత సెలెంట్ గా ఉండే ఎంపీల్లో ఒకరిగా పేరున్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఇవాళ తిరుమల పర్యటన సందర్భంగా నోరు విప్పారు. సాధారణంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యల జోలికి కానీ, ఇతర పార్టీలపై విమర్శలకు కానీ దూరంగా ఉండే శ్రీధర్ ఇవాళ తిరుమల వచ్చిన సందర్భంగా వైసీపీ-బీజేపీ స్నేహం, ఇతర అంశాలపై మాట్లాడారు. అంతే కాదు రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాల్ని కూడా శ్రీధర్ చెప్పేశారు. దీంతో శ్రీధర్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

బీజేపీకి మద్దతు బహిరంగమే..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ .. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతిస్తున్న అంశంపై పలుమార్లు విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. కానీ ఇందులో దాపరికమేమీ లేదని వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ ఇవాళ తెలిపారు.
ముూడేళ్లుగా ప్రతీ బిల్లుకూ మద్దతిచ్చామని ఆయన తెలిపారు. అంతే కాదు కేంద్రానికి అలా మద్దతిస్తున్నందుకే ఏపీకి నిధులు వస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు. దీంతో కేంద్రానికి మద్దతివ్వడం ద్వారా నిధుల్ని సాధిస్తున్నామన్న అంశాన్ని వైసీపీ ఎంపీ బహిరంగంగా చెప్పినట్లయింది.

హోదా ఇస్తే కేంద్ర కేబినెట్లోకి ?
ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అన్నీ తెస్తున్నామని, ప్రత్యేక హోదా ఒక్కటే రావాల్సి ఉందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వెల్లడించారు. అలాగే తమకు కేంద్రం నుంచి ప్రత్యేక రహోదా సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. 2024లో వైసీపీకి మరో అవకాశం వస్తుందని, అప్పుడు కేంద్రంలో చేరే అవకాశం వస్తే ప్రత్యేక హోదా కండిషన్ పెట్టి సాధిస్తామని కోటగిరి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ కేంద్ర కేబినెట్లో ఎందుకు చేరడం లేదనే ప్రశ్నలకు కూడా జవాబు దొరికినట్లయింది.
-
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications