సాయిరెడ్డికి రఘురామ షాక్: స్పీకర్‌ను బెదిరించారంటూ రెబల్ ఫిర్యాదు -గతంలో వెంకయ్యను కూడా
దేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన తీరును మార్చుకోలేదు. వైసీపీ సర్కారు తీరును ఎండగడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రోజుకు రెండు మూడు లేఖలు రాస్తోన్న ఆయన.. తాజాగా వైసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని చిక్కుల్లోకి నెట్టేసే ప్రయత్నం చేశారు. అనర్హత వేటు వ్యవహారాన్ని మలుపుతిప్పేలా కీలక చర్యకు ఉపక్రమించారు. వివరాలివి..

సాయిరెడ్డి దూకుడు వ్యాఖ్యలు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై అనర్హత వేటుకు సంబంధించి వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించకపోవడంపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున కనీసం ఇప్పుడైనా రఘురామ వ్యవహారాన్ని తేల్చేయాలంటూ సాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం ఇటీవల స్పీకర్ ఓం బిర్లాను కలిసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి దూకుడు వ్యాఖ్యలు చేశారు. రఘురామపై అనర్హత పిటిషన్ వేసి ఏడాది దాటిందని, ఈ విషయంలో స్పీకర్ పక్షపాత ధోరణిని కనబరుస్తున్నారని, స్పీకర్ గనుక రఘురామపై చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని, అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని సాయిరెడ్డి అన్నారు. దీనిపై..

హక్కుల కమిటీకి రఘురామ లేఖ
అనర్హత వేటు విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి ఎంపీ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను గర్హిస్తూ రెబల్ రఘురామ అనూహ్య చర్యకు పూనుకున్నారు. స్పీకర్ ఓంబిర్లా, పార్లమెంట్ సభా హక్కుల కమిటీ చైర్మన్‌కు రఘురామ శుక్రవారం లేఖ రాశారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విజయసాయి అనడం అనైతికమని, సభా కార్యక్రమాలను అడ్డుకుంటామనడం ముమ్మాటికీ బెదిరింపుల కిందికే వస్తుందని అన్నారు. అంతేకాదు,

గతంలో వెంకయ్యపైనా విమర్శలు
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెదిరించే ప్రయత్నం చేశారని ఆరోపించిన రఘురామ.. సభా హక్కుల కమిటీ చైర్మన్ కు రాసిన లేఖలో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరును కూడా ప్రస్తావించారు. సాయిరెడ్డి గతంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యపైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలే చేశారని, ఇప్పుడు కూడా లోక్ సభ స్పీకర్‌పై బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, విజయసాయిరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు లేఖలో కోరారు. ఈ వ్యవహారంపై సభా హక్కుల చైర్మన్, స్పీకర్ కార్యాలయం, సాయిరెడ్డి స్పందించాల్సిఉంది.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications