• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రఘురామ మరో సంచలనం -కేసీఆర్‌పై ప్రశ్నల తూటాలు -జగన్‌తో సమరమే -మోదీ, అమిత్ షాలకూ -సుప్రీంలో రేపే

|

ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం సుమోటోగా నమోదు చేసిన దేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో అనూహ్య చర్యకు దిగారు. కేసులు, అరెస్టు తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమరమే కొనసాగుతుందనే స్పష్టమైన సంకేతాలిస్తూ, వ్యవహారంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా లాగారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకూ ఏపీ సర్కారుపై తీవ్రమైన ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు రఘురామ రాసిన మూడు వేర్వేరు లేఖలు సంచలనం రేపుతున్నాయి. వివరాలివి..

మోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూమోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూ

కేసీఆర్‌కు 8పేజీల లేఖ

కేసీఆర్‌కు 8పేజీల లేఖ

ఒక ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు అనుసరించలేదని, ప్రధానంగా గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) నిబంధనలను అసలు పట్టించుకోలేదని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీ రఘురామ శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు.

సైబరాబాద్ కమిషనర్ సహా తన అరెస్టులో ప్రమేయమున్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. పలు సందర్భాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, పోలీసు మాన్యువల్‌ చెబుతున్న మార్గదర్శకాలను లేఖలో పేర్కొన్నారు రఘురామ. ఈనెల 14న తన అరెస్టు సమయంలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనను వివరిస్తూ... కేసీఆర్‌కు మొత్తం 8 పేజీల లేఖ రాశారు.

ఎఫ్ఐఆర్ ఉందో లేదో చూడకుండానే..

ఎఫ్ఐఆర్ ఉందో లేదో చూడకుండానే..

కేసీఆర్ కు రాసిన లేఖలో రఘురామ అనేక కీలక విషయాలను ప్రస్తావించారు. ‘‘నాపై ఏపీసీఐడీ సూమోటోగా కేసు నమోదు చేసింది. ఈ కేసును గుంటూరు సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ నేతృత్వంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లోని నా నివాసమైన 74వ నంబర్‌ విల్లాకు ఒక బృందం వచ్చింది.

నన్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు గచ్చిబౌలి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కనీస పోలీసు మాన్యువల్స్‌ను కూడా పట్టించుకోలేదు. ఎంపీగా ఉన్న నా అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదు. ఏపీసీఐడీ నుంచి ట్రాన్సిట్‌ రిమాండ్‌ ఆర్డరు తీసుకోలేదు. అసలు ఎఫ్‌ఐఆర్‌ ఉందో లేదో కూడా పరిశీలించలేదు.

మోదీ.. నీ కాళ్లు మొక్కుతా, కక్ష మానుకో -సీఎస్ రీకాల్ రాష్ట్రాలకే అవమానం -బెంగాల్ సీఎం మమత సంచలనంమోదీ.. నీ కాళ్లు మొక్కుతా, కక్ష మానుకో -సీఎస్ రీకాల్ రాష్ట్రాలకే అవమానం -బెంగాల్ సీఎం మమత సంచలనం

టీఎస్ పోలీసులు ‘రూల్‌ ఆఫ్‌ లా' ఏది?

టీఎస్ పోలీసులు ‘రూల్‌ ఆఫ్‌ లా' ఏది?

నన్ను అరెస్టు చేసే ముందు నా ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను పట్టించుకోలేదు. నన్ను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఏపీసీఐడీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యతనూ విస్మరించారు. నన్ను కారులోకి నెట్టేస్తున్నా గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ స్పందించలేదు.

రాజ్యాంగ హక్కులను కాపాడడంలో భాగంగా నా అరెస్టుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అది కూడా తీసుకోలేదు. అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దును దాటేముందు ప్రస్తుతమున్న నిబంధనలు, మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతిని ఏపీసీఐడీ తీసుకోలేదు. తెలంగాణ పోలీసులు ‘రూల్‌ ఆఫ్‌ లా'ను అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి. ఏపీ సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయపాల్‌ బృందంతోపాటు నా నివాసానికి వచ్చిన గచ్చిబౌలి పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి'' అని కేసీఆర్ ను రఘురామ అభ్యర్థించారు. మరోవైపు..

టైమిస్తే జగన్ గురించి అన్నీ చెబుతా..

టైమిస్తే జగన్ గురించి అన్నీ చెబుతా..

అరెస్టు వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన ఎంపీ రఘురామ అటు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు సైతం వేర్వేరుగా లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు, తన పట్ల జగన్ ప్రభుత్వం అవలంబించిన వైఖరిని లేఖల్లో వివరించారు రఘురామ. వ్యక్తిగతంగా కలుసుకుని జరిగిన వివరించేందుకు సమయం ఇవ్వాలని కూడా ఎంపీ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

రఘురామను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయన భార్య రమాదేవి, కొడుకు భరత్, కూతురు ఇందు ప్రియదర్శినిలు అమిత్‌షాను, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకుని జరిగిన పరిణామాలను వివరించడం తెలిసిందే. ఇదిలా ఉంటే..

  #TopNews : Chandrababu ప్లాన్ విఫలం | Pandem Kodi తరహా లో Rapo 19 || Oneindia Telugu
  రఘురామ కేసుపై సుప్రీంలో విచారణ

  రఘురామ కేసుపై సుప్రీంలో విచారణ

  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై ఏపీ సీఐడీ నమోదు చేసిన దేశద్రోహం కేసులో ఏ2, ఏ3లుగా టీవీ 5, ఏబీఎన్ న్యూస్ ఛానళ్లున్నాయని తెలిసిందే. ఎంపీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో దురుద్దేశంతో తమను చేర్చారంటూ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి', ‘టీవీ 5' ఛానళ్లు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది.

  దీనితో పాటు కరోనా విషయంలో కవరేజీకి కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ కూడా అదేరోజు విచారణకు రానుంది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు రానున్న కేసుల జాబితాలో ఈ పిటిషన్లను చేర్చారు.

  English summary
  In an interesting turn, narasapuram ysrcp mp raghu rama krishnam raju writes letters to telangana chief minister, prime minister narendra modi and union home minister amit shah over ap govt and ap cm ys jagan. the rebel mp, who is on bail in sedition case filed by ap cid, alleged that telangana police hid not fallow rools at his arrest time and seeks action on cyberabad police. in letter to modi and shah, raghurama complaints on ap cm ys jagan. meanwhile supreme court to hear sedition case on tv5 and abn news on monday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X