జగన్ కోరిక తీర్చండి- కేంద్రమంత్రులకు రఘురామ లేఖలు- ఆ విషయంలో
ఏపీలో వైసీపీ, ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్దితులు ఉన్నాయి. ఏడాదిన్నరగా రఘురామరాజు ఎన్ని విమర్శలు చేస్తున్నా పట్టించుకోని వైసీపీ సర్కార్ తాజాగా సీఐడీతో రాజద్రోహం కేసు పెట్టించాక ఈ వార్ మరింత ముదిరింది. దీంతో రఘురామరాజు వైసీపీని ఎక్కడ వీలు దొరికితే అక్కడ టార్గెట్ చేస్తున్నారు. అయితే తాజాగా కేంద్రమంత్రులకు సీఎం వైఎస్ జగన్ కోరిక నెరవేర్చాలంటూ రఘురామరాజు లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జగన్‌పై రఘురామ మరో అస్త్రం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ వరుసగా సీఎం జగన్‌కు లేఖలు రాస్తున్న రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇప్పుడు ఆయనపై మరో అస్త్రం సంధించారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేఫథ్యంలో జగన్‌ను ఇరుకునపెట్టేందుకు ఆయన మరో అస్త్రం ప్రయోగిస్తున్నారు. పార్టీ లైన్ దాటకుండానే సీఎం జగన్‌ను, వైసీపీ సర్కారును ఇబ్బందిపెట్టేలా రఘురామ ప్రయోగిస్తున్న ఈ అస్త్రం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

కేంద్రమంత్రులకు రఘురామ లేఖలు
ఏపీకి సంబంధించిన ఓ కీలక సమస్యపై కేంద్రానికి రఘురామరాజు ఇవాళ లేఖలు రాశారు. కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ప్రహ్లాద్ జోషీకి రఘురామరాజు విడివిడిగా లేఖలు రాశారు. ఈ లేఖల్లో రఘురామరాజు ప్రస్తావించిన అంశాలు సీఎం జగన్‌తో పాటు ఏపీ ప్రభుత్వాన్నీ ఇరుకునపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ వైఖరితో విభేధించకుండానే రఘురామరాజు ఈ లేఖలు రాయడం ఇక్కడ విశేషం.

జగన్ కోరిక నెరవెర్చాలని రఘురామ వినతి
ఏపీలో శాసనమండలి రద్దుకు సహకరించాలని కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషీకి రాసిన లేఖల్లో రఘురామ కోరారు. సీఎెం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలని ఆయన కేంద్రమంత్రుల్ని కోరారు. మండలి రద్దు కోసం గతంలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, గతంలో ఆ తీర్మానం కాపీని కేంద్రానికి కూడా పంపామని రఘురామ గుర్తుచేశారు. సీఎం జగన్ గతంలో చేసిన ప్రయత్నం మేరకు మండలి రద్దు హామీ నిలబెట్టుకోవాలని, ఇందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications