Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాలోకం తాను సింహాన్నని, పులి బిడ్డనని బొబ్బలు.. అజ్ఞాని అశోక్ కు ఆ భయం ఉందా? సాయిరెడ్డి సెటైర్లు

ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టిడిపి వర్సెస్ వైసిపి కొనసాగుతూనే ఉంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో మాన్సాస్ ట్రస్ట్ పై , అశోక్ గజపతిరాజు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో నారా లోకేష్ ను, చంద్రబాబును సైతం టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాన్సస్ ట్రస్ట్ వివాదాన్ని వదిలిపెట్టడం లేదు. నిత్యం సంచలన ట్వీట్ లు చేస్తున్నారు.

పుత్రరత్నం ఇంత దద్దమ్మ అవుతాడని కలలో కూడా ఊహించి ఉండడు చంద్రబాబు

పుత్రరత్నం ఇంత దద్దమ్మ అవుతాడని కలలో కూడా ఊహించి ఉండడు చంద్రబాబు


పుత్రరత్నం ఇంత దద్దమ్మ అవుతాడని కలలో కూడా ఊహించి ఉండడు చంద్రబాబు అంటూ లోకేష్ పై విరుచుకుపడిన విజయసాయిరెడ్డి చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేందుకు టెడ్డీబేర్,పులి బొమ్మలు కొనిచ్చి ఉంటాడు చంద్రబాబు. అందుకే ఇంకా ట్రాన్స్ నుండి బయట పడని మాలోకం తాను సింహాన్నని, పులి బిడ్డనని బొబ్బలు పెడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. కావాల్సినంత కామెడీ పంచుతున్నాడు అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.

అశోక్ మరియు అతని ఏటీఎం భాగస్వామి చంద్రబాబు కుట్ర

అశోక్ మరియు అతని ఏటీఎం భాగస్వామి చంద్రబాబు కుట్ర


ఇక అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి విజయనగరంలోని మహారాజా హాస్పిటల్ పీవీజీ రాజు గారు విరాళంగా ఇచ్చిన భూమిలో నిర్మించారు. అయితే అది పని చేయకుండా చేసి పూసపాటి అశోక్ మరియు అతని ఏటీఎం భాగస్వామి చంద్రబాబు ఆసుపత్రి భూమిని తిరిగి అశోక్ కు ఇవ్వడానికి కుట్రపన్నారు. 2018 మార్చి 7వ తేదీన జీవో నెంబర్ 124 ను జారీ చేశారు. ఇప్పుడు దానిని బహిర్గతం చేయడానికి విచారణ తప్పక జరుగుతుంది అని పేర్కొన్నారు.

అశోక్ ను అజ్ఞాని అని పిలిచేవారు .. అశోక్ ఎప్పుడూ రాజు కాదు

అశోక్ ను అజ్ఞాని అని పిలిచేవారు .. అశోక్ ఎప్పుడూ రాజు కాదు


అంతేకాదు పీవీజీ రాజు గారు మహారాజా అనే బిరుదును ఎప్పుడు ఉపయోగించని సోషలిస్ట్. పీవీజీ రాజు గారు సింధియా పాఠశాల నుండి బహిష్కరించబడిన అశోక్ ను అజ్ఞాని అని పిలిచేవారు. అశోక్ ఎప్పుడు రాజు కాదు, రాజు కాలేడు.. ఫేక్ రాజా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అజ్ఞాని అశోక్ మాజీ రెవెన్యూ మంత్రి కావడం వల్ల ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏమిటో తెలియదని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఫోరెన్సిక్ ఆడిట్ లంచాలు అక్రమ భూమి అమ్మకం మరియు కల్పిత లావాదేవీలు వంటి విశ్వసనీయమైన దుశ్చర్యల యొక్క కీలకమైన ఆపరేషన్లను కనుగొనడంలో సహాయపడుతుంది అంటూ పేర్కొన్నారు.

అజ్ఞాని అశోక్ మనసులో ఫోరెన్సిక్ భయం ఉందా?

అజ్ఞాని అశోక్ మనసులో ఫోరెన్సిక్ భయం ఉందా?


అజ్ఞాని అశోక్ మనసులో ఫోరెన్సిక్ భయం ఉందా అంటూ ప్రశ్నించారు విజయ సాయి రెడ్డి. మాన్సాస్ , సింహాచలం ట్రస్ట్ చైర్మన్ గా సంచైత గజపతిరాజు నియామక జీవోను రద్దు చేస్తూ అశోక్ గజపతిరాజు ను తిరిగి నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అశోక్ గజపతిరాజు తిరిగి మాన్సాస్ , సింహాచలం ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్ గజపతిరాజు టార్గెట్ చేస్తూ విజయ సాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+