వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కట్టప్ప నిమ్మగడ్డ , శాడిస్టు బాబుకోసం, ఉసురు బానిసకు,బాస్ కు..మద్రాస్ కోర్టు తీర్పుతో లింక్ : సాయిరెడ్డి ధ్వజం

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో,దేశంలో తాజా పరిణామాలు ఏవైనా ప్రతి ఒక్కదానితో టీడీపీ అధినేత చంద్రబాబుకు లింకు పెట్టి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించే విజయసాయిరెడ్డి తాజాగా మరోమారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈసారి మద్రాస్ హైకోర్టు ఇటీవల ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టాలని చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబుకి, నిమ్మగడ్డకు లింకుపెట్టి మరీ తిట్టిపోశారు.

డప్పు కొట్టుకునే బాబు, లోకేష్ వింత జీవి , ఎగ్జామ్స్ పై పప్పునాయుడు నీ బాధేంటి ? సాయిరెడ్డి వ్యగ్యండప్పు కొట్టుకునే బాబు, లోకేష్ వింత జీవి , ఎగ్జామ్స్ పై పప్పునాయుడు నీ బాధేంటి ? సాయిరెడ్డి వ్యగ్యం

చంద్రబాబు, నిమ్మగడ్డపై సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి

సోషల్ మీడియా వేదికగా సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘమా.. సెకండ్ వేవ్ పాపమంతా మీదే.. మీ పై మర్డర్ కేసు పెట్టాలి అన్న వార్తను పోస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ పంచ్ వేశారు. నాడు ప్రభుత్వం వద్దని చెబుతున్నానిమ్మగడ్డతో ఎన్నికలు పెట్టించిన పచ్చ మందకి ఈ కరోనా సెకండ్ వేవ్ పాపంలో భాగం ఉంది అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మద్రాస్ హైకోర్టు తీర్పు నేపధ్యంలో నిమ్మగడ్డనూ బుక్ చెయ్యాలి

అంతేకాదు రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ పాపం నిమ్మగడ్డదే అని పేర్కొన్న ఆయన కట్టప్పగా మారిన నిమ్మగడ్డ , శాడిస్టు బాబు కోసం కోర్టుకు వెళ్లి మరీ ఎలక్షన్లు పెట్టించారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇదే సమయంలో మద్రాస్ హైకోర్టు ఎన్నికల కమిషన్ మీద చేసిన వ్యాఖ్యలను, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆపాదించారు. మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డనూ బుక్ చేయాలి. కోవిడ్ తో చనిపోయిన ప్రతి ఒక్కరి ఉసురు బానిస కు, బాస్ కు తగిలి తీరుతుంది అన్నారు విజయ సాయి రెడ్డి .

సాయిరెడ్డి వ్యాఖ్యలకు సెటైర్లు వేసిన నెటిజన్లు .. లాజిక్ తో కొట్టారుగా!!

సాయిరెడ్డి వ్యాఖ్యలకు సెటైర్లు వేసిన నెటిజన్లు .. లాజిక్ తో కొట్టారుగా!!

తాజా కోవిడ్ పరిస్థితులకు ఏపీలో ఎన్నికలు పెట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు కారణమని మద్రాస్ హైకోర్టు తీర్పుతో లింకు పెట్టి తిట్టిపోశారు. ఇక విజయసాయి రెడ్డి తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విజయసాయిరెడ్డికి రివర్స్ పంచ్ ఇస్తున్నారు. అప్పుడు పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలు పెట్టించిన పాపం టిడిపి నాయకులది అయితే, ఆ తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టించిన పాపం వైసిపి నాయకులది కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

 తిలా పాపం తలా పిడికెడు అంటూ నెటిజన్లు సెటైర్లు

తిలా పాపం తలా పిడికెడు అంటూ నెటిజన్లు సెటైర్లు

తిలా పాపం తలా పిడికెడు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.మరికొందరు గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు పెట్టిన సమయంలో కరోనా సెకండ్ వేవ్ లేదని,ఆ ఎన్నికల కారణంగానే కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పెరిగిందని చెప్పడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసి సాయిరెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు. 420లెక్కలని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ధూళిపాళ నరేంద్ర అరెస్ట్ విషయాన్ని వదిలిపెట్టని విజయసాయిరెడ్డి ధూళిపాళ్ళపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు తన క్రిమినల్ పిల్లుల కోసం నక్క జిత్తులు ఆపాలన్న సాయిరెడ్డి

చంద్రబాబు తన క్రిమినల్ పిల్లుల కోసం నక్క జిత్తులు ఆపాలన్న సాయిరెడ్డి

తాజాగా ధూళిపాళ్ళను అరెస్ట్ చేసి సంగం డెయిరీని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి ఊహించిన షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు అతని సహచరులుగా ఉన్న దొంగ పిల్లులు ఎవరూ చూడడం లేదనుకొని చీకట్లో పాలు తాగారు. కానీ ఇప్పుడు ప్రతి కుంభకోణం బయటకు వస్తుంది. నేరస్తులు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు క్రిమినల్ పిల్లుల కోసం జిత్తులమారి నక్కలా వ్యవహరించడాన్ని ఆపేసి, న్యాయస్థానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

English summary
YSRCP MP Vijaya Sai Reddy has recently satirized Chandrababu, and former election commissioner Nimmagadda Ramesh kumar..Vijayasai Reddy, who has been linking TDP leader Chandrababu with every latest development in the state and the country as a social media platform, has recently once again criticised TDP leader Chandrababu Naidu. This time, the Madras High Court verdict has linked Chandrababu and Nimmagadda to the recent remarks that a murder case should be filed against the Election Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X