సాయిరెడ్డిని ఇరిటేట్ చేస్తున్న టీడీపీ నేతలు-అచ్చం,బుచ్చం అంటూ కౌంటర్లు-పీక్ లో ఫ్రస్ట్రేషన్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న వార్ ఇప్పుడు ట్వీట్ల రూపంలో మరింతగా ముదిరిపోయింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను నిత్యం టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెడుతున్న ట్వీట్లపై గతంలో అప్పుడప్పుడూ స్పందించే టీడీపీ నేతలు. ఇప్పుడు ఎన్నికల వాతావరణంతో రోజూ స్పందిస్తున్నారు. అంతే కాదు సాయిరెడ్డి వాడుతున్న భాషకు నాలుగింతలు దూషణలతో ఆయన్ను ఇరిటేట్ చేస్తున్నారు. దీంతో వీరి ట్వీట్ల వార్ రాబోయే రోజుల్లో ఏ స్ధాయిలో వెళ్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు.

చంద్రబాబుపై సాయిరెడ్డి ట్వీట్లు
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి ఆయన్ను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యం రెచ్చిపోతున్నారు. ఈ మూడేళ్లలో కొన్ని వేల ట్వీట్లు పెట్టిన విజయసాయిరెడ్డి ఆయన కుమారుడు లోకేష్ ను కూడా వదలడం లేదు. ఓ ట్వీట్ లో చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసే సాయిరెడ్డి, మరో ట్వీట్ లో ఆయన కుమారుడు లోకేష్, ఇంకోట్వీట్ లో ఇద్దరినీ కలిపి, మరో ట్వీట్ లో చంద్రబాబు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా పదే పదే బూతుపదాలతో సాయిరెడ్డి రెచ్చిపోతున్నారు. ఓ ఎంపీ అన్న విషయం కూడా మర్చిపోయి సాయిరెడ్డి వాడుతున్న భాష టీడీపీ నేతలకు మంటపుట్టిస్తోంది.

కౌంటర్లు మొదలుపెట్టేసిన టీడీపీ
గతంలో సాయిరెడ్డి నిత్యం చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తున్నా, పరుషమైన భాష వాడుతూ ట్వీట్లు పెడుతున్నా మర్యాదగా కౌంటర్లు ఇచ్చిన టీడీపీ నేతలు.. ఈ మధ్య రూటుమార్చారు. ఇప్పుడు సాయిరెడ్డి వాడుతున్న భాషకు ఏమాత్రం తగ్గని రీతిలో పలువురు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. సాయిరెడ్డి వాడుతున్న భాషలోనే ఆయనకు కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. దీంతో సాయిరెడ్డి ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. దీంతో రాష్ట్రంలో ఈ వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఫ్రస్ట్రేషన్ లో సాయిరెడ్డి ట్వీట్లు ?
టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి పెడుతున్న ట్వీట్లకు ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ మధ్య బుద్ధా వెంకన్న, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి వంటి నేతలు సాయిరెడ్డి భాషలోనే ఆయనకు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఆయన ఇరిటేట్ అవుతున్నట్లు తాజా ట్వీట్లను చూస్తే అర్ధమవుతోంది. ఇవాళ సాయిరెడ్డి పెట్టిన ట్వీట్లో అచ్చం, బుచ్చం, బుద్ధిలేని వెంకు, బూతుపాత్రుడు, బ్రోతల్ హౌస్ ఓనర్ నుంచి పప్పు, బొల్లిబాబులంటూ సాయిరెడ్డి రెచ్చిపోయారు. ఈ ట్వీట్లలో సాయిరెడ్డి వాడిన భాష చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ ట్వీట్ వార్ నెటిజన్లతో పాటు సాధారణ ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ పెంచేలా ఉంది.












Click it and Unblock the Notifications