ఎస్ బ్యాంకు లావాదేవీల్లో చంద్రబాబు పాత్ర ? సాయిరెడ్డి సెన్సేషనల్ ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్ బ్యాంకు ద్వారా చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేశారని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. రూ.1300 కోట్ల టీటీడీ నిధులను చంద్రబాబు సర్కారు ఎస్.బ్యాంకులో డిపాజిట్ చేసిందని సాయిరెడ్డి వెల్లడించారు.ఏపీ టూరిజం నిధులు కూడా ఎస్. బ్యాంకులో డిపాజిట్లు చేశారని సాయిరెడ్డి ట్వీట్ లో ఆరోపించారు..

 ఎస్ బ్యాంకు ద్వారా బాబు దోపిడీ

ఎస్ బ్యాంకు ద్వారా బాబు దోపిడీ

టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే అంతెత్తున ఎగిరే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ మరోసారి ట్విట్టర్ వేదికగా ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. అదీ దివాలా తీసిన ఎస్.బ్యాంకు వ్యవహారంలో కావడంతో సాయిరెడ్డి ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.ఎస్ బ్యాంకును అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వలో చంద్రబాబు రాష్ట్రాన్ని లూటీ చేశాడని సాయిరెడ్డి ఆరోపించారు.

రూ.1300 కోట్ల నిధులను

రూ.1300 కోట్ల నిధులను

గత ప్రభుత్వంలో రూ.1300 కోట్ల రూపాయల టీటీడీ నిధులను కమిషన్ల కోసమే చంద్రబాబు ఎస్. బ్యాంకులో డిపాజిట్ చేయించారని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కి తీసుకుని పెద్ద ప్రమాదం నుంచి కాపాడారన్నారు అని విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఏపీ టూరిజం నిధుల దోపిడీ

చంద్రబాబు తన హయాంలో టీటీడీ నిధులతో పాటు ఏపీ టూరిజం శాఖ నిధులను కూడా ఎస్. బ్యాంకులో డిపాజిట్ చేయించారని, కమిషన్ల కోసమే ఇదంతా చేశారని విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో ఆరోపించారు. ఇంకెన్ని ఉన్నాయో అని కూడా ట్వీట్ లో రాశారు. ఇందుకు రుజువుగా ఆయన ఎస్‌ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఎస్. బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించడంతో ఈ నిధులన్నీ అందులోనే బ్లాక్ అయినట్లు సాయిరెడ్డి ట్వీట్ ద్వారా తెలుస్తోంది.

Recommended Video

    Jwala Gutta Reveals How Chandrababu Naidu Helped Her | Jwala Gutta Interview | Oneindia Telugu
    ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో

    ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో

    ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా ఎస్.బ్యాంకుతో పాటు మరికొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో నిధులను వెనక్కి తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ రేటింగ్స్ ఆధారంగానే ఇకపై టీటీడీ నిధులను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+