విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించిన ఉప రాష్ట్రపతి..!!

న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ అధినేత‌, రాజ్య‌స‌భలో ప్రతిపక్ష నాయకుడు స‌భ్యుడు వీ విజ‌యసాయి రెడ్డికి అరుదైన అవ‌కాశం ల‌భించింది. రాజ్య‌స‌భ వైస్ ఛైర్మ‌న్‌గా ఆయ‌న ఎంపిక‌య్యారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభలో ఉన్నత హోదాను పొందడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆయన వేర్వేరు కమిటీల్లో కొనసాగుతున్నారు.

లోక్‌సభలో కూడా వైసీపీకే చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్యానెల్‌గా స్పీకర్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. ఎప్పట్లాగే ఈ దఫా కూడా రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో ప‌లువురు కొత్త వారికి అవ‌కాశం లభించింది. ఇందులో- విజ‌య‌సాయి రెడ్డి పేరును చేర్చారు. ఆయ‌న‌తో పాటు ఈ అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న వారిలో మ‌రి కొంత‌మంది ఉన్నారు. అస్సాంకు చెందిన భువ‌నేశ్వ‌ర్ క‌లిఠా, క‌ర్ణాట‌క నుంచి ఎన్నికైన కాంగ్రెస్ స‌భ్యుడు డాక్టర్ లంకప్ప హ‌నుమంత‌య్య ఉన్నారు.

YSRCPs MP Vijayasai Reddy appointed as Vice Chairman of Rajya Sabha

త‌మిళ‌నాడులో అధికారంలో ఉన్న డీఎంకే స‌భ్యుడు తిరుచ్చి శివ‌, ఒడిశా నుంచి బిజూ జ‌న‌తాద‌ళ్ స‌భ్యుడు సుస్మిత్ పాత్రోను కొన‌సాగించారు. పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నగర్ వైస్ ఛైర్మన్ల జాబితాలో ఉన్నారు.

YSRCPs MP Vijayasai Reddy appointed as Vice Chairman of Rajya Sabha

కాగా- ఇదివరకు నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యురాలు వంద‌నా చ‌వాన్‌కు మ‌రోసారి అవ‌కాశం లభించలేదు. ఈ ప్యానెల్ జాబితా నుంచి త‌ప్పించారు. ఆ స్థానంలో వీ విజ‌య‌సాయి రెడ్డికి అవకాశం లభించినట్టయింది. రాజ్య‌స‌భ ఛైర్మ‌న్, డిప్యూటీ ఛైర్మ‌న్ అందుబాటులో లేన‌ప్పుడు ఈ ప్యానెల్ స‌భ్యులు స‌భ‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఛైర్మ‌న్ స్థానంలో కూర్చుని స‌భను నిర్వ‌హించాల్సిన బాధ్య‌త ప్యానెల్ వైస్ ఛైర్మ‌న్ల‌కు ఉంటుంది. విజయ‌సాయి రెడ్డి తొలిసారిగా ప్యానెల‌ వైస్ ఛైర్మ‌న్ గా ఎన్నిక‌య్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+