అప్పట్లో గంటా రాజీనామా-ఇప్పుడు శ్రీభరత్, పల్లా శ్రీనివాసరావు ?
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వరదలు మినహా పెద్దగా సమస్యలు ఏవీ తలెత్తలేదు. కానీ తాజాగా విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం అడుగులు వేయబోతోందన్న వార్తలు కలకలం రేపాయి. దీంతో తిరిగి కార్మికులు నిరసన బాట పట్టారు. అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగంలోకి దిగుతున్నాయి.
గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదించమని కూడా కోరారు. అయితే ఎన్నికల వరకూ ఇది తేలలేదు. ఇప్పుడు మరోసారి విశాఖలో స్టీల్ ప్లాంట్ నిరసనలు మిన్నంటడంతో ఈసారి టీడీపీ నేతల రాజీనామాలకు విపక్ష వైసీపీ డిమాండ్లు మొదలుపెట్టింది. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో అధికార పార్టీ విఫలమైందని, అందుకు బాధ్యతగా విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రాజీనామాలు చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారని, ఆయన రాజీనామాను 2024 జనవరిలో స్పీకర్ ఆమోదించారని గుర్తుచేసారు.
The then MLA, Sri Ganta Srinivas Rao, resigned in February 2021 in protest against the decision to privatize the Vizag Steel Plant, and his resignation was accepted in January 2024. Taking inspiration from him, Vizag Lok Sabha MP Bharat Mathukumilli (@sribharatm) and local MLA…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 13, 2024
అప్పటి గంటా శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత వైజాగ్ పార్లమెంటు సభ్యుడు భరత్ మతుకుమల్లి శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. వారు అలా రాజీనామా చేయకపోయినా, ప్రభుత్వంపై వత్తిడి చేయకపోయినా చరిత్ర వారిని ద్రోహులుగా, మోసగాళ్లుగా పరిగణిస్తుందన్నారు. ప్రజలు వారిద్దరినీ క్షమించరు. వారు చేసిన ద్రోహానికి వారిద్దరికీ గట్టి గుణపాఠం జనం చెబుతారంటూ సాయిరెడ్డి ట్వీట్ ముగించారు.












Click it and Unblock the Notifications