వదల చంద్రబాబు వదల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని వైసిపి టార్గెట్ చేస్తూనే ఉంది అధికారంలోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను తప్పుపడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండ కట్టే ప్రయత్నం చేస్తుంది వైసిపి. ఇక చంద్రబాబు పాలనపై నిత్యం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీపావళి పండుగనాడు కూడా చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేశారు.

బాబు వచ్చాడు.. ధరలు ఆకాశాన్నంటాయి: సాయిరెడ్డి
ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన ఎంపీ విజయ సాయి రెడ్డి బాబు వచ్చాడు.. ధరలు ఆకాశాన్నంటాయి అంటూ టార్గెట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యవసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి అని నిప్పులు చెరిగారు. కూరగాయలు కొండెక్కి, మాంసం ధరలు మండిపోతూ, పప్పులు నిప్పయ్యాయి అని పేర్కొన్న సాయి రెడ్డి ఒకదాని ధర పెరిగిందని మరోదానితో సర్దుకునే పరిస్థితి లేక ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది అంటూ తన పోస్టులో వెల్లడించారు.

ysrcp mp vijayasai reddy made shocking tweets on cm chandrababu

చంద్రబాబు పాలనలో భవిష్యత్తు అంధకారం
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారన్నారు. అయినా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు సామాన్యుడిపై విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నాడు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు . బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటి నినాదం ఇప్పుడు బాబు వచ్చాడు - భవిష్యత్తు అంధకారం నినాదంగా మారిపోయిందని సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.

చంద్రగ్రహణం పట్టిస్తున్నాడు
అంతేకాదు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తున్న సాయిరెడ్డి అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు నిధులను దారిమళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టిస్తున్నాడు అంటూ మండిపడ్డారు.

చంద్రబాబు దుర్భుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలి
పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాగు, సాగు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు దుర్భుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలి అని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబును దీపావళి నాడు కూడా వదలకుండా టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+